Asia Cup 2025: ఆసియా కప్ 2025 షెడ్యూల్ ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ కన్ ఫర్మ్ చేసేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. బీసీసీఐ ఆతిథ్య హక్కులను కలిగి ఉంటుంది. ఆసియా కప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా టీమిండియా బరిలోకి దిగనుంది. అయితే స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేకుండా భారత్ ఆసియా కప్ ఆడబోతోంది. ఈ ఇద్దరు లెజెండ్స్ ఇంటర్నేషన్ క్రికెట్ కు దూరంగా ఉన్నారు. చివరిసారిగా మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఆడారు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు లేకపోవడం వెనుక గల కారణం.. ఆసియా కప్ T20 ఫార్మాట్‌లో జరగనుండటమే. 2026 ప్రారంభంలో T20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ క్రమంలో ACC ఆసియా కప్ టోర్నమెంట్‌ను T20 ఫార్మాట్‌లో నిర్వహిస్తుంది. జూన్ 29న బ్రిడ్జ్‌టౌన్‌లో భారత్ 2024 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత విరాట్, రోహిత్ ఇద్దరూ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఫైనల్ తర్వాత మాజీ T20I కెప్టెన్లు ఇద్దరూ షాకింగ్ ప్రకటన చేశారు. ఇక, 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వరకు టెస్ట్ క్రికెట్ ఆడటం కొనసాగించారు. ఆ తర్వాత 2025 మే లో టెస్ట్ క్రికెట్ కు కూడా ఇద్దరూ గుడ్ బై చెప్పేశారు.
Also Read: గంభీర్ స్థానంలో టీమ్ఇండియా టెస్టు జట్టు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ?
వీరిద్దరూ ఇప్పటికీ వన్డే క్రికెట్‌లో యాక్టివ్ గానే ఉన్నారు. 2027 వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. వన్డేల్లో భారత్ కి నాయకత్వం వహిస్తున్న రోహిత్ 2027 వరల్డ్ కప్ లో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రోహిత్ ఆధ్వర్యంలో ఇండియా 2023 వరల్డ్ కప్ ఫైనల్ చేరుకుంది. 2025లో ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కాకుండా రవీంద్ర జడేజా కూడా 2025 ఆసియా కప్‌కు దూరమవుతాడు. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఒక రోజు తర్వాత అతను ఈ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశాడు.
ఇక ఆసియా కప్ విషయానికి వస్తే.. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో భారత్ తన ఆసియా కప్ జర్నీని ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. సెప్టెంబర్ 19న ఒమన్‌తో తలపడనుంది. కాంటినెంటల్ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ మూడుసార్లు తలపడే అవకాశం ఉంది.