VVS Laxman-Gautam Gambhir : గంభీర్ స్థానంలో టీమ్ఇండియా టెస్టు జట్టు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ?
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గంభీర్ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన తీసికట్టుగా మారింది.

Is that Laxman To Replace Gambhir As India Test Team Coach
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గంభీర్ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన తీసికట్టుగా మారింది. గంభీర్ మార్గనిర్దేశ్యంలో ఇప్పటి వరకు టీమ్ఇండియా పది టెస్టులు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇందులో ఆస్ట్రేలియా పర్యటనలో ఓ మ్యాచ్, ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో ఓ మ్యాచ్‌ను భారత్ గెలిచింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టులను గెలుచుకుంది.
అయితే.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0-3 తేడాతో భారత్ చేజార్చుకుని, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ తరువాత ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లో 2-1 తేడాతో భారత్ వెనుకబడి ఉంది. ఇక నాలుగో టెస్టు మ్యాచ్‌లో ప్రస్తుతం 137 పరుగులు వెనుకబడి ఉంది. ఆఖరి రోజు 8 వికెట్లు చేతిలో ఉండగా భారత్ డ్రా కోసం ప్రయత్నిస్తోంది.
Asia Cup 2025 : ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేయండి.. బీసీసీఐ పై మండిపడుతున్న ఫ్యాన్స్..
🚨 ANNOUNCEMENT 🚨
🚨 NEW RED BALL COACH 🚨
Laxman might take over from Gambhir as the head coach for the Indian Test team. pic.twitter.com/k3DcmlYf8n
— indianTeamCric (@Teamindiacrick) July 26, 2025
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న గంభీర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి టెస్టుల వరకు మాత్రం మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌కు ఆ బాధ్యతలను అప్పగిస్తున్నారనేది సదరు పోస్ట్ సారాంశం. ఈ పోస్ట్‌ను ఇప్పటికే 3.50 లక్షల మంది చూడగా, 550 కంటే ఎక్కువ సార్లు రీ పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ ఓడిపోతే గంభీర్ స్థానానికి ముప్పు తప్పదా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే.. ప్రస్తుతానికి దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లుగా తెలుస్తోంది. ముఖ్యమైన సిరీస్ మధ్యలో బీసీసీఐ ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోదు. ఒకవేళ బీసీసీఐ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు, టెస్టు క్రికెట్‌కు వేరు వేరు కోచ్‌లను నియమించాలని భావిస్తే అప్పుడు గంభీర్‌తో ఖచ్చితంగా సమావేశం అవుతుంది.
ENG vs IND : శుభ్‌మన్ గిల్- కేఎల్ రాహుల్ అద్భుత రికార్డు.. గత 54 ఏళ్లలో ఇదే తొలిసారి..
ఇప్పటి వరకు అలాంటిది ఏమీ జరగలేదు. గంభీర్ హెడ్ కోచ్‌గా ఉండగా ఈ ఏడాది ఛాంపియన్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. రోహిత్, కోహ్లీలు ఇంగ్లాండ్ పర్యటనకు కొద్ది రోజుల ముందే రిటైర్‌మెంట్ కావడంతో ప్రస్తుతం భారత టెస్టు జట్టు పరివర్తన చెందుతున్న దశలో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.