ENG vs IND : శుభ్‌మన్ గిల్- కేఎల్ రాహుల్ అద్భుత రికార్డు.. గత 54 ఏళ్లలో ఇదే తొలిసారి..
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకు టీమ్ఇండియా గట్టిగానే పోరాడుతోంది.

ENG vs IND 4th test Shubman Gill and KL Rahul break 54 years old record
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకు టీమ్ఇండియా గట్టిగానే పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి భారత్ 174 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (78), కేఎల్ రాహుల్ (87) లు ఉన్నారు. భారత్ ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉంది.
311 పరుగుల లోటుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది. నాలుగో బంతికి యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా, ఐదో బంతికి సాయి సదర్శన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో స్కోరు బోర్డుపై పరుగులు చేరకముందే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను గిల్, రాహుల్‌లు భుజాన వేసుకున్నారు.
ENG vs IND : అప్పుడు కోచ్ ఎలాగో.. ఇప్పుడు శిష్యుడూ అలాగే.. 11 ఏళ్లు తేడా అంతే.. వీడియో వైరల్..
వీరిద్దరు 62 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి మరో వికెట్ పడకుండా నాలుగో రోజును ముగించారు. వీరిద్దరు అభేద్యమైన మూడో వికెట్‌కు 174 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే గిల్-రాహుల్ జోడీ ఓ అరుదైన ఘనతను సాధించారు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో శుభ్‌మన్ గిల్, రాహుల్ లు ఇద్దరూ కూడా 500 పరుగుల మార్క్‌ను దాటేశారు. గిల్ ఇప్పటి వరకు 697, రాహుల్ 508 పరుగులు చేశారు. కాగా.. విదేశీ గడ్డపై ఒకే టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేయడం గత 54 ఏళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 1970-71 విండీస్ పర్యటనలో భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, దిలీప్ సర్దేశాయ్ ఈ ఫీట్ సాధించారు. ఆ సిరీస్‌లో సునీల్ గవాస్కర్ 774 పరుగులు చేయగా దిలీప్ సర్దేశాయ్ 642 పరుగులు చేశారు.