ENG vs IND : అప్పుడు కోచ్ ఎలాగో.. ఇప్పుడు శిష్యుడూ అలాగే.. 11 ఏళ్లు తేడా అంతే.. వీడియో వైర‌ల్..

వ‌చ్చిన అవ‌కాశాన్ని టీమ్ఇండియా యువ ఆట‌గాడు సాయి సుద‌ర్శ‌న్ స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు.

ENG vs IND : అప్పుడు కోచ్ ఎలాగో.. ఇప్పుడు శిష్యుడూ అలాగే.. 11 ఏళ్లు తేడా అంతే.. వీడియో వైర‌ల్..

Sai Sudharsans golden duck in 4th test evokes old gautam gambhir moment

Updated On : July 27, 2025 / 12:39 PM IST

ఇంగ్లాండ్‌తో మాంచెస్ట‌ర్ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో వ‌చ్చిన అవ‌కాశాన్ని టీమ్ఇండియా యువ ఆట‌గాడు సాయి సుద‌ర్శ‌న్ స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్ తొలి ఇన్నింగ్స్‌లో 61 ప‌రుగుల‌తో రాణించిన‌ప్ప‌టికి కీల‌కమైన రెండో ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు.

క్రిస్ వోక్స్ బంతిని కొట్ట‌కూడ‌ద‌ని అనుకుని, బాల్‌ను వ‌దిలి వేసే ప్ర‌య‌త్నంలో ఔట్ అయ్యాడు. అత‌డు ఔటైన విధానం దాదాపు 11 ఏళ్ల కింద‌ట టీమ్ఇండియా ప్ర‌స్తుత హెడ్ కోచ్ గంభీర్ ఔటైన విధంగానే ఉంది. 2014లో లండ‌న్‌లోని ది ఓవ‌ల్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన నాటి మ్యాచ్‌లో అండ‌ర్స‌న్ వేసిన బంతిని వ‌దిలి వేసే క్ర‌మంలో గంభీర్ తొలి బంతికే డ‌కౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో భార‌త్ ఇన్నింగ్స్ 244 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

ENG vs IND : సిరాజ్ స్మార్ట్ వాచ్‌ను ప‌గ‌ల‌గొట్టిన జోరూట్‌.. వీడియో వైర‌ల్‌..

కాగా.. సాయి సుద‌ర్శ‌న్ ఔట్ ను డ్రెస్సింగ్ రూమ్ నుంచి గంభీర్ చూశాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి ఔట్‌ల‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 358 ప‌రుగులు చేసింది. అనంత‌రం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 669 ప‌రుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌కు 311 ప‌రుగుల కీల‌క మైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.

భారీ లోటుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్‌కు ఇన్నింగ్స్ ప్రారంభంలో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. మొద‌టి ఓవ‌ర్‌లోని నాలుగో బంతికి య‌శ‌స్వి జైస్వాల్ ఔట్ అయ్యాడు. ఈ ద‌శ‌లో మైదానంలో అడుగుపెట్టిన సాయి సుద‌ర్శ‌న్ పై ఎంతో బాధ్య‌త ఉంది. అయితే.. అత‌డు ఆడిన తొలి బంతికే డ‌కౌట్ అయ్యాడు. దీంతో భార‌త్ వ‌రుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ రెండు వికెట్ల‌ను కూడా క్రిస్ వోక్స్ ప‌డ‌గొట్టాడు.

ఈ స‌మ‌యంలో కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (78), కేఎల్ రాహుల్ (87) లు ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దారు. వీరిద్ద‌రు స‌మ‌యోచితంగా ఆడారు. దాదాపు రెండున్నర సెష‌న్ల సేపు బ్యాటింగ్ చేసి మ‌రో వికెట్ ప‌డ‌కుండా నాలుగో రోజును ముగించారు. ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి 174 ప‌రుగులు చేసింది. భార‌త్ ఇంకా 137 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.