ENG vs IND : సిరాజ్ స్మార్ట్ వాచ్‌ను పగలగొట్టిన జోరూట్.. వీడియో వైరల్..
ఇంగ్లాండ్ సినీయర్ ఆటగాడు జోరూట్ ప్రస్తుతం భీకరఫామ్‌లో ఉన్నాడు.

ENG vs IND 4th test Joe Root doesnt like watches Accidentally Siraj Smart Band
ఇంగ్లాండ్ సినీయర్ ఆటగాడు జోరూట్ ప్రస్తుతం భీకరఫామ్‌లో ఉన్నాడు. మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో అతడు టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు.
కాగా.. అతడు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మహ్మద్ సిరాజ్‌ను అనుకోకుండా ఢీ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 52వ ఓవర్‌లో చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను టీమ్ఇండియా పేసర్ సిరాజ్ వేశాడు. ఈ ఓవర్‌లోని 5వ బంతికి రూట్ షాట్ ఆడేందుకు యత్నించగా.. బంతి అతడి బ్యాట్‌ను మిస్సై ప్యాడ్ ను తాకింది.
ENG vs IND : మురిపించారు.. మళ్లీ ఏడిపించరు గదా.. 90 ఓవర్లు.. 8 వికెట్లు..
View this post on Instagram
వెంటనే సిరాజ్ అంపైర్ వైపుకు తిరిగి రెండు చేతులను చాచి ఎల్బీడబ్ల్యూకోసం అప్పీల్ చేశాడు. అదే సమయంలో రూట్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. రూట్ రన్ తీసే క్రమంలో పొరబాటున అతడి బ్యాట్ సిరాజ్ చేతికి ఉన్న స్మార్ట్ వాచ్‌కు తాకింది. దీంతో వాచ్ సిరాచ్ చేతి నుంచి కిందపడిపోయింది. కొద్ది సేపటి తరువాత గ్రౌండ్‌లో పడిపోయిన తన వాచీని చూసుకుంటూ సిరాజ్ ఆ వీడియోలో కనిపించాడు. వాచ్ కాస్త డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 669 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు 311 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (78), కేఎల్ రాహుల్ (87) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉంది.