పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్ పై 4000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఇంగ్లాండ్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో ఈ రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ రికార్డును సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఆరో బ్యాటర్‌గా నిలిచాడు.
తాజా మ్యాచ్‌తో కలిపి ఇప్పటి వరకు కోహ్లీ ఇంగ్లాండ్ పై (వన్డేలు, టీ20లు, టెస్టులు) 87 మ్యాచ్‌లు ఆడాడు. 4 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 8 సెంచరీలు, 23 అర్థశతకాలు సాధించాడు.
IND vs ENG : మూడు మార్పులతో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. నిరాశపరిచిన రోహిత్ శర్మ..
ఓవరాల్‌గా ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ 5028 పరుగులతో ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత వరుసగా అలెన్ బోర్డర్, స్టీవ్ స్మిత్ , రిచర్డ్స్ ఉన్నారు.
🚨 HISTORY BY KING KOHLI 🚨
– Virat Kohli becomes the first Indian to complete 4000 runs against England in International cricket 🐐 pic.twitter.com/b9bUQHRgsc
— Johns. (@CricCrazyJohns) February 12, 2025
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు..
డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) – 63 ఇన్నింగ్స్‌ల్లో 5,028 పరుగులు
అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) – 124 ఇన్నింగ్స్‌ల్లో 4,850 పరుగులు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 114 ఇన్నింగ్స్‌ల్లో 4,815 పరుగులు
వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్) – 84 ఇన్నింగ్స్‌ల్లో 4,488 పరుగులు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 99 ఇన్నింగ్స్‌ల్లో 4,141 పరుగులు
విరాట్ కోహ్లీ (భారత్) – 109 ఇన్నింగ్స్‌ల్లో 4, 001 పరుగులు
ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీ 50 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 73వ హాఫ్ సెంచరీ. మొత్తంగా ఈ మ్యాచ్‌లో కోహ్లీ 55 బంతులు ఆడి 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఫిలిప్ సాల్ట్ క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ ఔట్ అయ్యాడు. వన్డేల్లో కోహ్లీని ఆదిల్ రషీద్ ఔట్ చేయడం ఇది 5వ సారి.