బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన స్థాయికి తగినట్లుగా ఆడడం లేదు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శతకం బాదిన కోహ్లీ.. ఆ తరువాత మూడు ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. గత రెండు టెస్టుల్లో తగినంత శ్రమశిక్షణ పాటించలేదని అంగీకరిస్తూనే బాక్సింగ్‌డే టెస్టులో పరుగుల వరద పారిస్తానని కోహ్లీ చెప్పాడు.
మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ఫ్రారంభమైంది. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీతో రవిశాస్త్రి మాట్లాడాడు. గత రెండు, మూడు ఇన్నింగ్స్‌ల్లో తాను అనుకున్న విధంగా ఆడలేకపోయానని కోహ్లీ తెలిపాడు. క్రమశిక్షణతో పరుగులు సాధించలేకపోయినట్లుగా అంగీకరించాడు. టెస్టు క్రికెట్ అంటేనే సవాల్‌తో కూడుకున్నదన్నాడు. గతంతో పోలిస్తే ఈ సారి పిచ్‌ల్లో జీవం ఎక్కువగా ఉన్నట్లు చెప్పాడు.
IND vs AUS : బాక్సింగ్‌డే టెస్టు.. అరంగ్రేట ఆటగాడితో విరాట్ కోహ్లీ గొడవ..
అందుకనే ఈ సారి విభిన్నంగా ఆడడం ఎంతో ముఖ్యమన్నాడు. జట్టుకు అవసరమైన విధంగా పరుగులు చేయడంతో పాటు, తన ఆటతీరును మరింత మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఇక తనకు మెల్‌బోర్న్‌లో ఎన్నో మధురజ్ఞాపకాలు ఉన్నాయన్నాడు.
ఇక్కడ తన తొలి పర్యటనలో చాలా పరుగులు చేసినట్లుగా గుర్తు చేసుకున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో గెలిచాము. 2014-15 సీజన్‌లో ఇక్కడ సెంచరీ చేశాను. ఇక ఇక్కడ అన్ని ఫార్మాట్లలోనూ ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ సారి మాత్రం తాను ఆశించిన విధంగా ఆసీస్‌లో రాణించలేకపోతున్నానని అంగీకరించాడు. తన ఆత్మగౌరవం కూడా దెబ్బతిందని, తిరిగి పుంజుకునేందుకు మెల్‌బోర్న్ టెస్టు సరైన వేదిక అని తాను భావిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు.
Cricket Viral Videos : అరుదైన ఘటన.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. బౌలర్ చేతికి గాయం..