అడిలైడ్ వన్డే : కోహ్లీ సెంచరీ

  • Published By: madhu ,Published On : January 15, 2019 / 10:30 AM IST
అడిలైడ్ వన్డే : కోహ్లీ సెంచరీ

Updated On : January 15, 2019 / 10:30 AM IST

అడిలైడ్ : మళ్లీ ఆదుకున్నాడు. తానున్నానంటూ…కోహ్లీ నిరూపించాడు. పలు క్లిష్ట సమయాల్లో తనదైన ఆటను ప్రదర్శించి భారత్‌ని విజయ తీరాలకు చేర్చిన విరాట్ కోహ్లీ..ఆసీస్‌‌తో జరుగుతున్న రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ సాధించి దూసుకెళుతున్నాడు. 
108 బంతుల్లో కోహ్లీ సెంచరీ.
వన్డేలో 39వ సెంచరీ.
ఆస్ట్రేలియాపై ఆరో సెంచరీ. 
ఛేజింగ్‌లో 24వ సెంచరీ. 

ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డే భారత్‌కి కీలకం. ఇందులో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ 9 వికెట్ల కోల్పోయి 298 రన్స్ చేసింది. ఇందులో షాన్ మార్ష్ సెంచరీ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన భారత ఓపెనర్లు చక్కటి శుభారంభం అందించారు. శర్మ (43), ధావన్ (32) పరుగులు చేసి అవుట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన కోహ్లీ వన్డేలో విశ్వరూపం చూపించాడు. బ్యాటింగ్‌కి పని చెప్పాడు. గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలించాడు. బాధ్యతాయుతంగా ఆడిన కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేసి సెంచరీ వైపుకు దూసుకెళ్లాడు. కేవలం 110 బంతులను ఎదుర్కొన్న విరాట్ 103 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 2 సిక్స్‌లున్నాయి. ఇతనికి ధోని చక్కటి సపోర్టు ఇచ్చాడు. భారత్ ప్రస్తుతం 43 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. 42 బంతుల్లో 61 పరుగులు చేయాల్సి ఉంది.