×
Ad

IND vs AUS 2nd ODI : వ‌రుస‌గా రెండో వ‌న్డేలోనూ కోహ్లీ డ‌కౌట్‌.. ఒకే ఓవ‌ర్‌లో భార‌త్‌కు డ‌బుల్ షాక్..

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీకి రీ ఎంట్రీలో ఏదీ క‌లిసిరావ‌డం లేదు. వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ విఫ‌లం అయ్యాడు.

Virat Kohli Dismissed For A Duck In 2nd ODI Against Australia

IND vs AUS 2nd ODI : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీకి రీ ఎంట్రీలో ఏదీ క‌లిసిరావ‌డం లేదు. వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ విఫ‌లం అయ్యాడు. అడిలైడ్ వేదిక‌గా ఆసీస్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డే (IND vs AUS 2nd ODI) మ్యాచ్‌లోనూ కోహ్లీ డ‌కౌట్ అయ్యాడు.

నాలుగు బంతులు ఆడిన కోహ్లీ జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. తొలి వ‌న్డేలోనూ కోహ్లీ ప‌రుగుల ఖాతాను తెర‌వ‌ని సంగ‌తి తెలిసిందే. అంటే ఆసీస్‌ ప‌ర్య‌ట‌న‌లో కోహ్లీ ఇంత వ‌ర‌కు ఒక్క ప‌రుగు కూడా చేయ‌లేదు. కోహ్లీ తన వన్డే కెరీర్‌లో ఇలా వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్‌ కావడం ఇదే తొలిసారి.

Womens World Cup 2025 : న్యూజిలాండ్‌తో చావో రేవో మ్యాచ్‌.. భారత్‌ ఆ బలహీనతను అధిగమిస్తుందా?

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఒకే ఓవ‌ర్‌లో డ‌బుల్ షాక్ త‌గిలింది. ఇన్నింగ్స్ 7వ ఓవ‌ర్‌ను జేవియర్ బార్ట్‌లెట్ వేశాడు. తొలి బంతికే ఓపెన‌ర్‌, కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (9) ఔట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ క్యాచ్ అందుకోవ‌డంతో గిల్ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో భార‌త్ 17 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

 

వ‌న్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ వ‌చ్చాడు. తొలి వ‌న్డేలో విఫ‌లమైన‌ అత‌డు రెండో వ‌న్డేలో భారీ స్కోరు సాధిస్తాడ‌ని అంతా ఆశించగా.. నాలుగు బంతులు మాత్ర‌మే ఆడాడు. ఏడో ఓవ‌ర్‌లోని ఐదో బంతికి ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 17 ప‌రుగుల వ‌ద్దే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

ప్ర‌స్తుతం 10 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు రెండు వికెట్ల న‌ష్టానికి 29 ప‌రుగులు. ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ (19), శ్రేయ‌స్ అయ్య‌ర్ (0) లు క్రీజులో ఉన్నారు.