Virat Kohli Enjoys Meal With Anushka Sharma And Daughter Vamika After Quarantine
Virat Kohli Family Photo : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మల క్వారంటైన్ ముగిసింది. ఈ సందర్భంగా కోహ్లీ భార్య అనుష్క, కుమార్తె వామికాతో కలిసి దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. తన క్యూట్ ఫ్యామిలీతో కలిసి కోహ్లీ బ్రేక్ ఫాస్ట్ చేశాడు. ఫ్యామిలీ ఫొటోను కోహ్లీ తన ట్విటర్ పేజీలో చేశాడు. ఇప్పుడా ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో భారత జట్టు టీ20 రెండో వార్మప్ మ్యాచ్ ఇవాళ (అక్టోబర్ 20)న జరుగనుంది. ఇటీవలే అనుష్క శర్మ కూడ భర్త కోహ్లీ, కుమార్తె వామికా ఫొటోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
— Virat Kohli (@imVkohli) October 20, 2021
ఆ ఫొటోలో కలర్‌ఫుల్ బాల్స్ మధ్యలో వామికా కూర్చొని ఆడుకుంటోంది. కోహ్లీ కుమార్తె వామికాతో సరదాగా ఆడుకున్న ఫొటోను ఆమె షేర్ చేసింది. ఈ ఒక్క ప్రేమ్ లోనే తన హృదయం ఉందని అనుష్క క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇటీవలే యూఏఈకి తిరిగివచ్చిన అనుష్క శర్మ ఈ ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. క్వారంటైన్ సమయంలో కొవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ ఇద్దరూ విజయవంతంగా పూర్తిచేశారు.
Samantha : 3 యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దావా
Anushka