Virat Kohli Wears Jersey Number 18
Virat Kohli jersey number: ఆట ఏదైనా కానివ్వండి అందులో ఆడే ప్లేయర్లు వేసుకునే జెర్సీలపై నంబర్లు కనిపించడాన్ని చూస్తూనే ఉంటాం. కొందరు జాతకాలను అనుసరించి, మరికొందరు న్యూమరాలజీ ప్రకారం, ఇంకొందరు తమకు కలిసి వస్తుందని ఒక్కొక్కరు ఒక్కొ దాన్ని నమ్ముకుంటూ అంకెలను తాము ధరించే జెర్సీలపై ఉండేలా చూసుకుంటారు. క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) తన కెరీర్‌లో ఎక్కువగా నంబర్ 10 జెర్సీని వేసుకునే ఆడాడు.
భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోని(MS Dhoni) 7వ నంబర్ జెర్సీని వేసుకోగా, భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) జెర్సీ నంబర్ 18 అన్న సంగతి తెలిసిందే. ఆ నెంబర్‌కు కోహ్లికి ఉన్న అనుబంధం ఏంటి..? ఆ నంబర్ ఎలా వచ్చింది..? అన్న విషయాలను ఓ ఇంటర్వ్యూలో విరాట్ చెప్పాడు. వాస్తవానికి ఆ సంఖ్యను విరాట్ కోరి తీసుకోలేదట. మొదటి సారి అండర్ 19 క్రికెట్ ఆడినప్పుడు తనకు ఆ నంబర్ ఇచ్చారని కోహ్లి తెలిపాడు.
Virat Kohli: ఇందుకోసమా నేను ఇంతకాలం బాధపడింది.. ఆ సెంచరీ తరువాత విరాట్ భావోద్వేగం
ఫలానా నంబర్ కావాలని విరాట్ ఎప్పుడు, ఎవ్వరిని అడగలేదట. ఆ సమయంలో అది ఓ నంబర్ మాత్రమేనని చెప్పిన విరాట్.. కాలక్రమంలో అది చాలా ముఖ్యమైన నంబర్‌గా మారిపోయిందన్నాడు. ‘టీమ్ఇండియా తరుపున నేను తొలి మ్యాచ్ ఆడింది ఆగస్టు 18న, మా నాన్న చనిపోయింది డిసెంబర్ 18న. ఇలా నా జీవితంలో జరిగిన రెండు ముఖ్యమైన ఘటనలు జరిగింది 18వ తేదీనే కావడం గమనార్హం. ఈ విషయం ఎప్పుడూ తలచుకున్నా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ రెండు ఘటనలు జరగడానికి ముందే ఈ నంబర్ జెర్సీ ఇచ్చారు. దీంతో ఈ నంబర్‌కు నాకు ఏదో రాసి పెట్టి ఉందని నమ్ముతుంటా.’ అని విరాట్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్‌ల్లో 131.53 స్ట్రైక్ రేట్‌తో 438 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధశతకాలు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో బెంగళూరు 12 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది. చివరి రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తే నేరుగా ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోనుంది.
Virat Kohli: జైస్వాల్‌ను ప్రశంసిస్తూ కోహ్లి పోస్ట్.. కాసేపటికే డిలీట్.. అసలు సంగతి ఇదే..?