Virat Kohli: జైస్వాల్‌ను ప్ర‌శంసిస్తూ కోహ్లి పోస్ట్‌.. కాసేప‌టికే డిలీట్‌.. అస‌లు సంగ‌తి ఇదే..?

కోల్‌క‌తాపై జైశ్వాల్ ఆడిన ఇన్నింగ్స్‌ను ప్ర‌శంసిస్తూ విరాట్ కోహ్లి త‌న సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అయితే.. కాసేటికే వాటిని డిలీట్ చేశాడు.

Virat Kohli:  జైస్వాల్‌ను ప్ర‌శంసిస్తూ కోహ్లి పోస్ట్‌.. కాసేప‌టికే డిలీట్‌.. అస‌లు సంగ‌తి ఇదే..?

Virat Kohli Deletes Instagram story

Virat Kohli Deletes Instagram story: కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(Kolkata Knight Riders) పై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు య‌శ‌స్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) ఆడిన ఇన్నింగ్స్‌పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. 13 బంతుల్లోనే 50 ప‌రుగులు చేసి ఐపీఎల్(IPL) చ‌రిత్ర‌లోనే అత్యంత వేగ‌వంత‌మైన అర్ధ‌శ‌త‌కాన్ని న‌మోదు చేశాడు. ఈ క్ర‌మంలోనే భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli) సైతం జైస్వాల్ ను మెచ్చుకున్నాడు. తాను చూసిన అద్భుత‌మైన ఇన్నింగ్స్‌ల్లో ఇదీ ఒక‌టి అంటూ స్కోర్ కార్డును చూపించే ఫోటోను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో పోస్ట్ చేశాడు.

అయితే.. కొద్దిసేప‌టికే ఆ ఫోటోను విరాట్ తొల‌గించాడు. కొద్ది స‌మ‌యంలోనే మ‌రో ఫోటోను ఉంచి మళ్లీ పోస్ట్ చేశాడు. విరాట్ ఇలా చేయ‌కుండా ఓ కార‌ణం ఉంది. మొద‌ట విరాట్ వినియోగించిన ఫోటోపై జియో సినిమా అని రాసి ఉంది. అందుక‌నే కోహ్లి వెంట‌నే ఆ ఫోటోను తొల‌గించాల్సి ఉంది. అదేంటి జియో సినిమా అని ఉన్నంత మాత్ర‌న డిలీట్ చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నిస్తున్నారా..? అక్క‌డే ఉంది అస‌లు స‌మ‌స్య‌.

Yashasvi Jaiswal : జైశ్వాల్‌ సెంచరీ కాకుండా కోల్‌క‌తా స్పిన్న‌ర్ ప్ర‌య‌త్నం.. నెటిజ‌న్ల మండిపాటు

విరాట్ స్టార్ స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్

ఐపీఎల్ 2023 సీజ‌న్ కోసం విరాట్ కోహ్లి స్టార్ స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. విరాట్ జియో సినిమాను ప్ర‌మోట్ చేసేలా తన అధికారిక ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో జియో సినిమా పేరు ఉన్న ఫోటో పోస్ట్ చేయ‌డం వ‌ల్ల వివాదం త‌లెత్తుతుంద‌ని బావించాడు. వెంట‌నే ఆ ఫోటోను డిలీట్ చేశాడు. అయితే.. అప్ప‌టికే కొంద‌రు దానిని స్క్రీన్ షాట్‌ల‌ను తీశారు. ప్ర‌స్తుతం ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగులు చేసింది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(57; 42 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 13.1 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి అందుకుంది. యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైశ్వాల్ దంచి కొట్టాడు. 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో విధ్వంసం సృష్టించాడు. అత‌డికి తోడు సంజు శాంస‌న్ (48 నాటౌట్; 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) రాణించ‌డంతో రాజ‌స్థాన్ ఈజీగా విజ‌యాన్ని అందుకుంది.

Jos Buttler : ఆర్ఆర్ బ్యాటర్ జోస్ బట్లర్ కు జరిమానా.. మ్యాచ్ ఫీజులో కోత