Virat Kohli : బ్రేకింగ్‌.. విరాట్ కోహ్లికి బిగ్ షాకిచ్చిన‌ బీసీసీఐ..

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి బీసీసీఐ షాకిచ్చింది.

Virat Kohli Fined : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి బీసీసీఐ షాకిచ్చింది. అత‌డి మ్యాచ్ ఫీజులో 50 శాతం జ‌రిమానా విధించింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆట‌గాడు అయిన కోహ్లి ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్ల‌ఘించినందుకు ఫైన్‌ వేసిన‌ట్లు తెలిపింది.

“ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం కోహ్లీ లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. అతను నేరాన్ని అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ అత‌డికి మ్యాచ్ ఫీజులో 50 శాతం జ‌రిమానా విధించాడు.” అని ఐపీఎల్ నిర్వాహ‌కులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కోల్‌క‌తా మ్యాచ్‌లో వివాదాస్పద ఔట్ తర్వాత మైదానంలోని అంపైర్లతో కోహ్లి తీవ్ర వాగ్వాదానికి దిగిన సంగ‌తి తెలిసిందే.

Viral Video : వెనుక నుంచి వ‌చ్చి రోహిత్ శ‌ర్మ‌కు ముద్దు ఇవ్వ‌బోయిన షేన్‌బాండ్‌..

అస‌లేం జ‌రిగిందంటే..?

223 ప‌రుగుల ల‌క్ష్యంతో కోహ్లి, ఫాప్ డుప్లెసిస్ ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగారు. అయితే.. మూడో ఓవ‌ర్‌ను హ‌ర్షిత్ రాణా వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని మొద‌టి బంతిని రాణా పుల్‌టాస్‌గా వేయ‌గా ముందుకు వ‌చ్చిన‌ కోహ్లి షాట్ ఆడాడు. అయితే బంతి గాల్లోకి లేచింది. బౌల‌ర్ హ‌ర్షిత్ రాణా క్యాచ్ ప‌ట్టుకున్నాడు.

కాగా.. ఆ బంతి త‌న న‌డుము కంటే ఎక్కువ ఎత్తులో వ‌చ్చిన‌ట్లుగా భావించిన కోహ్లి ఆ బాల్ నోబాల్ అంటూ డీఆర్ఎస్‌కు వెళ్లాడు. అయితే.. థర్డ్ అంపైర్ రీప్లేలో చూసిన తరువాత కోహ్లీ క్రీజు బయట ఉన్నాడని, బంతి నడుం కంటే తక్కువ ఎత్తులోనే వచ్చిందని ఔటిచ్చాడు. నేలపై నుంచి కోహ్లీ నడుం ఎత్తు 1.04 మీటర్లు కాగా.. అతను ఆడినప్పుడు బాల్‌ 0.92 మీటర్ల ఎత్తులోనే ఉందని సాంకేతిక సాయంతో అంపైర్ నిర్ణయించాడు.

Sunil Narine : ఐపీఎల్‌లో సునీల్ న‌రైన్ స‌రికొత్త చ‌రిత్ర.. బుమ్రా బ‌ద్ద‌లు కొట్టేనా?

అంపైర్ నిర్ణ‌యం పై కోహ్లి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఫీల్డ్ అంపైర్ల‌తో వాగ్వాదానికి దిగాడు. పెవిలియ‌న్‌కు వెళ్తూ అరుచుకుంటూ వెళ్లాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒక్క ప‌రుగు తేడాతో ఓడిపోయింది.

ట్రెండింగ్ వార్తలు