Bcci kohli
Virat Kohli And BCCI : వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమైనట్లు వస్తున్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. ఇప్పటివరకైతే కోహ్లీ వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని పేర్కొంది. ప్రస్తుతానికైతే అతడు వన్డే సిరీస్‌లో ఆడతాడనే భావిస్తున్నామని తెలిపింది. వన్డే సిరీస్ నుంచి కోహ్లీ తప్పుకుంటున్నట్లు ఇప్పటి వరకూ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షాలకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు.
Read More : Viral Video: వధువు వీడియో వైరల్.. డ్రైవింగ్ చేసుకుంటూ.. డ్యాన్స్ వేసుకుంటూ వేదిక దగ్గరకు..
ఒకవేళ కోహ్లీ సమాచారం ఇస్తే.. దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతానికైతే అతడు జనవరి 19, 21, 23న జరిగే వన్డే మ్యాచుల్లో ఆడతాడనే భావిస్తున్నామని వెల్లడించింది. ఆటగాళ్లంతా తమ కుటుంబాలతో కలిసి దక్షిణాఫ్రికా బయలుదేరనున్నారని… టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కుటుంబంతోనే బయలుదేరుతాడని పేర్కొన్నారు.
Read More : DRDO’s menu : వ్యోమగాముల కోసం ఫుడ్.. మెనూ ఇదే
అయితే, బయోబబుల్‌లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం వల్ల టెస్టు సిరీస్ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తే బీసీసీఐకి కచ్చితంగా సమాచారం అందించాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు, దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ నుంచి కోహ్లీ కచ్చితంగా తప్పుకోవాలనుకుంటే.. ఆ తర్వాత శ్రీలంకతో జరిగే సిరీస్‌కు కూడా అతడు దూరమయ్యే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి.