DRDO’s menu : వ్యోమగాముల కోసం ఫుడ్.. మెనూ ఇదే

భారత అంతరిక్ష సంస్థ (ఇస్త్రో) గగన్ యాన్ ప్రాజెక్టు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. వ్యోమగాములకు శిక్షణ కూడా ఇస్తున్నారు...

DRDO’s menu : వ్యోమగాముల కోసం ఫుడ్.. మెనూ ఇదే

Gaganyaan

Karnataka DRDO’s Menu : అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల కోసం స్పెషల్ ఫుడ్ తయారు చేస్తున్నారు. రెడీ టూ ఈట్ వంటకాలను సిద్ధం చేస్తున్నట్లు డీఆర్డీవో వెల్లడించింది. చికెన్ బిర్యానీ, సాంబారు అన్నం..ప్రత్యేక ఆహార పదార్థాల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు డీఆర్డీవో శాస్త్రవేత్తలు వెల్లడించారు. గగన్ యాన్ లో భాగంగా రోదసిలోకి వెళుతున్న ముగ్గురు వ్యోమగాముల కోసం వంటకాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. తాము సిద్ధం చేస్తున్న వంటకాలను ఇస్రోకు పంపించడం జరుగుతుందని, అక్కడి నుంచి వచ్చే సమాచారం బట్టి..ఆహారపదార్థాల తుది జాబితాను సిద్ధం చేస్తామన్నారు.

Read More : Andhra Pradesh : ఏపీలో వజ్రాల గనులు, వెలికితీతకు టెండర్లు

భారత అంతరిక్ష సంస్థ (ఇస్త్రో) గగన్ యాన్ ప్రాజెక్టు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. వ్యోమగాములకు శిక్షణ కూడా ఇస్తున్నారు. కర్నాటక మైసూర్…లోని డీఆర్డీవోకు చెందిన డీఎఫ్ఆర్ఎల్ (DFRL)…ఫుడ్ ను తయారు చేస్తోంది. భూమి మీద అయితే కూర్చొని తింటారు. కానీ అంతరిక్షంలో అలా వీలు పడదు. ఎందుకంటే..అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు. దీంతో ఆహార పదార్థాలు గాలిలో తేలుతుంటాయి. ఈ క్రమంలో..వ్యోమగాములకు ప్రత్యేక ఆహారం రూపొందించాల్సి ఉంటుంది. దీనిపై తాము పని చేయడం జరుగుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రోదసిలోకి వెళుతున్న ముగ్గురు భారతీయుల కోసం ఫుడ్ ను తయారు చేస్తున్నారు. వెజ్ పులావ్, చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, దాల్ మఖ్కని, సూజి హల్వా, చికెన్ కూర్మ తదితర వంటకాలను చేరుస్తున్నారు.

Read More : Pushpa : గతంలో ఎడమ భుజానికి సర్జరీలు.. ‘పుష్ప’లో భుజం పైకి పెట్టుకుని నటించడంతో…

గగన్ యాత్ర 2022 చివరి నాటికి లేదా 2023 ప్రారంభంలో జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. రష్యాలోని గ్లావ్కోస్మోస్ సర్వీస్ ప్రొవైడర్ తో 2019లో ఇస్రో ఒప్పందం చేసుకుంది. 2020 ఫిబ్రవరి 10వ తేదీన వ్యోమగాములకు శిక్షణ ప్రారంభమైంది. అయితే..కరోనా కారణంగా..ట్రైనింగ్ కు మధ్యలోనే అంతరాయం ఏర్పడింది. ఈ సంవత్సరం మార్చిలో శిక్షణ పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగివచ్చారు.

చికెన్​ కట్టి
రోల్​వెజ్​ కట్టి
రోల్​ఎగ్​ కట్టి
రోల్​స్టఫ్డ్ పరోటా
చికెన్​ కూర్మ
వెజ్​ బిర్యానీ
వెజ్​ పులావ్​
చికెన్​ బిర్యానీ
నిషాహీ పనీర్
దాల్​ మఖ్కా
రెడీ టు డ్రింక్​
మ్యాంగో నెక్టర్​
పైనాపిల్​ జూస్​
టీ
కాఫీ

Read More : UK Woman : బిడ్డ కోసం బతికింది, కోమాలో ఉన్న మహిళకు డెలివరీ

కాంబో ఫుడ్​:-
దాల్​ చావల్​
రాజ్మా చావల్
సాంబార్​ చావల్​