Andhra Pradesh : ఏపీలో వజ్రాల గనులు, వెలికితీతకు టెండర్లు

జీ-4 సర్వే ఆధారంగా గనులకు వేలం నిర్వహించకూడదని కేంద్రం స్పష్టం చేయడంతో వజ్రాల గనికి ముందడుగు పడలేదు. ఆదాయం పెంచుకోవాల్సిన నేపథ్యంలో...

Andhra Pradesh : ఏపీలో వజ్రాల గనులు, వెలికితీతకు టెండర్లు

Kadapa

Diamonds In Kadapa : ఉప్పరపల్లి సమీపంలో వజ్రాల వేట ప్రారంభించనుంది మైనింగ్‌శాఖ. ఇప్పటికే వజ్రాల గని కేటాయింపునకు టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. పెన్నా పరివాహక ప్రాంతంలో వజ్రాల గనిని అధికారులు గుర్తించారు. దీంతో ప్రైవేట్ సంస్థల ద్వారా వజ్రాలు వెలికి తీసేందుకు చర్యలు చేపట్టింది. టెండర్ల ప్రక్రియకు సంబంధించిన దస్త్రాలు ప్రస్తుతం సీఎం పేచీలో ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆమోదముద్ర పడగానే టెండర్లు నిర్వహించనున్నారు.

Read More : Haiti Gas Tanker : హైతీలో గ్యాస్ ట్యాంకర్ పేలుడు…పెరుగుతున్న మృతుల సంఖ్య

కడప జిల్లాలోని పెన్నా నది పరివాహక ప్రాంతంలో వజ్రాలు గనులు ఉన్నాయని, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చిచెప్పింది. గత ఏడాది క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు చెన్నూరు మండలంలోని ఉప్పరపల్లి, ఓబులంపల్లి తదితర ప్రాంతాలలో సర్వే నిర్వహించారు. ఈ ప్రాంతాలలో కింబర్ లైట్ రాళ్లు ఉన్నందున వజ్రాలు లభిస్తాయని వారు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

Read More : UK Woman : బిడ్డ కోసం బతికింది, కోమాలో ఉన్న మహిళకు డెలివరీ

అయితే జీ-4 సర్వే ఆధారంగా గనులకు వేలం నిర్వహించకూడదని కేంద్రం స్పష్టం చేయడంతో వజ్రాల గనికి ముందడుగు పడలేదు. ఆదాయం పెంచుకోవాల్సిన నేపథ్యంలో కేంద్రం ఇటీవలే చట్టాన్ని సవరించింది. దీంతో వజ్రాల గనుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రాల వెలికితీతకు టెండర్ల ప్రక్రియను నిర్వహించనుంది.