UK Woman : బిడ్డ కోసం బతికింది, కోమాలో ఉన్న మహిళకు డెలివరీ

లారావార్డ్ స్కూల్ టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండేవారు. పాఠశాల వేసవి సెలవుల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌ తేలింది. అప్పటికే ఆమె గర్భం దాల్చారు...

UK Woman : బిడ్డ కోసం బతికింది, కోమాలో ఉన్న మహిళకు డెలివరీ

Uk Women

UK Woman Birth To Girl : బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో అద్భుత ఘటన జరిగింది. ఓ మహిళ చావు అంచుల వద్దకు వెళ్లి వచ్చి తన బిడ్డను ముద్దాడింది. కోమాలోకి వెళ్లిన ఓ మహిళకు ఆపరేషన్‌ చేసి వైద్యులు బిడ్డను బయటకి తీశారు. ఆ తర్వాత ఆ మహిళ కొన్ని రోజులు కోమాలోనే ఉండి.. తర్వాత కోలుకున్నారు. అయితే అప్పటికే ఆమెకు బిడ్డ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. మహమ్మారి కారణంగా ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవడంతో.. 31వ వారంలో ఆపరేషన్ చేసి, వైద్యులు బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. కోమాలో ఉండటంతో ఈ విషయం ఆమెకు గుర్తులేదు.

Read More : YSR Pension Kanuka : వృద్ధాప్య పెన్షన్ పెరిగింది..సీఎం జగన్ కీలక నిర్ణయం

లారావార్డ్ స్కూల్ టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండేవారు. పాఠశాల వేసవి సెలవుల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌ తేలింది. అప్పటికే ఆమె గర్భం దాల్చారు. వైరస్ కారణంగా ఆమెకు శ్వాస సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకున్నప్పటికీ.. పరిస్థితి మరింత దిగజారింది. వాస్తవంగా లారా ప్రసవ సమయం అక్టోబర్‌లో అయినా.. ఆమె పరిస్థితి దిగజారడంతో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సిన పరిస్థితి ఎదురైంది.

Read More : AP PRC : పీఆర్సీపై ఉత్కంఠ, ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ

కానీ లారాకు మాత్రం ఇదంతా ఏం గుర్తులేదు. ఆమెకు కొవిడ్ వార్డుకు వచ్చిన విషయం మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. ఏడు వారాల తర్వాత కళ్లు తెరిచి చూడగా.. పక్కనే ఉన్న బిడ్డను చూసి, ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. తన బిడ్డ కోసం బతికానని అంటోంది లారా.