AP PRC : పీఆర్సీపై ఉత్కంఠ, ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ

ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని... 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు సజ్జల...

AP PRC : పీఆర్సీపై ఉత్కంఠ, ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ

Ap Prc

Updated On : December 15, 2021 / 8:08 AM IST

CM Jagan : ఉద్యోగుల పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, సచివాలయ ఉద్యోగ సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో విడివిడిగా సజ్జల సమావేశమయ్యారు. 11వ పీఆర్సీ సహా 70 డిమాండ్ల అమలుపై సజ్జల చర్చించారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లను సీఎం వద్దకు తీసుకెళ్లేందుకు వారితో చర్చలు జరిపారు.

Read More : Google Staff: వ్యాక్సినేషన్ రూల్స్ పాటించకపోతే గూగుల్ నుంచి ఔట్

ఎంత పీఆర్సీ ఆశిస్తున్నారనే విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆరా తీశారు. ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం చర్చల సారాంశం, వారి డిమాండ్లను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు సజ్జల. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు తెలిపిన అభిప్రాయాలను సీఎంకు వివరించారు. 2021, డిసెంబర్ 15వ తేదీ బుధవారం ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్‌ చర్చలు జరిపే అవకాశం ఉంది.

Read More : KCR Tamil Nadu : కమల్‌‌తో సీఎం కేసీఆర్ భేటీ ?

ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని… 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు సజ్జల. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ వల్ల ఐఆర్‌ కంటే రూపాయి కూడా తగ్గదని.. ఎక్కువగానే లబ్ది ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు కోరే 45 శాతం సాధ్యం కాదని కమిటీ చెప్పిందన్నారు సజ్జల. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని… అయినప్పటికీ అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చేలా సీఎస్ కమిటీ ప్రతిపాదనలు చేసిందని పేర్కొన్నారు.