Google Staff: వ్యాక్సినేషన్ రూల్స్ పాటించకపోతే గూగుల్ నుంచి ఔట్

దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతున్నా ఖాతరు చేయని వారిని హెచ్చరిస్తూ కొవిడ్ వ్యాక్సినేషన్ రూల్స్ ను ముందుకు తెచ్చింది. ఈ క్రమంలో గూగుల్ లీడర్‌షిప్ డిసెంబర్ 3లోపు....

Google Staff: వ్యాక్సినేషన్ రూల్స్ పాటించకపోతే గూగుల్ నుంచి ఔట్

google-omicron

Google Staff: మాతృ సంస్థ ఆల్ఫాబెట్ తీసుకునే నిర్ణయంపై గూగుల్ ఉద్యోగుల భవితవ్యం ఆధారపడి ఉంది. దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతున్నా ఖాతరు చేయని వారిని హెచ్చరిస్తూ కొవిడ్ వ్యాక్సినేషన్ రూల్స్ ను ముందుకు తెచ్చింది. ఈ క్రమంలో గూగుల్ లీడర్‌షిప్ డిసెంబర్ 3లోపు వ్యాక్సినేషన్ వేయించుకుని ఉండాలి.

కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా మతపరంగా ఏదైనా అభ్యంతరం ఉంటే డాక్యుమెంటేషన్ లో ముందుగానే పొందుపరచాలి. డిసెంబర్ 3వరకూ ఈ ప్రక్రియ చేయని ఉద్యోగులను సంప్రదిస్తున్న గూగుల్.. వారి రిక్వెస్ట్ లను అప్రూవ్ చేయాలనుకోవడం లేదని ఇంగ్లీష్ మీడియా ర్యూటర్స్ తెలిపింది.

మరోసారి అవకాశమిస్తూ.. జనవరి 18నాటికి వ్యాక్సినేషన్ రూల్స్ ను పాటించని తమ ఉద్యోగులకు పెయిడ్ అడ్మినిస్ట్రేటివ్ లీవ్స్ కింద 30రోజుల పాటు సెలవుల్లో ఉంటారు. ఆ తర్వాత ఆరు నెలల పాటు అన్ పెయిడ్ పర్సనల్ లీవ్ దాంతో పాటు టెర్మినేషన్ కూడా ఉంటుందని ర్యూటర్స్ పేర్కొంది. దీనిపై గూగుల్ అధికారికంగా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.

……………………………: కమల్‌‌తో సీఎం కేసీఆర్ భేటీ ?

ఈ నెలారంభంలో గూగుల్ ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రప్పించాలనుకున్నా.. ఒమిక్రాన్ వేరియంట్ భయంతో వద్దని చెప్పేసింది. దాంతో వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసింది. అయితే జనవరి 10నుంచి వారానికి మూడుసార్లు ఆఫీసుకు వస్తే సరిపోతుందని పేర్కొన్నారు.