Haiti Gas Tanker : హైతీలో గ్యాస్ ట్యాంకర్ పేలుడు…పెరుగుతున్న మృతుల సంఖ్య

గ్యాస్‌ ట్యాంకర్‌ ఒక బైక్‌ను తప్పించపోయి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్యాస్‌ను సేకరించేందుకు అక్కడి ప్రజలు పరుగులు తీశారు.

Haiti Gas Tanker : హైతీలో గ్యాస్ ట్యాంకర్ పేలుడు…పెరుగుతున్న మృతుల సంఖ్య

62 Burned

62 Burned Alive Explosion :  హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ ట్యాంకర్ పేలుడు సంభవించి.. 62మంది దుర్మరణం పాలయ్యారు. హైతియన్ సిటీలో గల కాప్ హైతియన్‌‌లో ఈ ఘోరం చోటు చేసుకుంది. పేలుడు స్థలంలో సుమారు 50 నుంచి 54 మంది సజీవ దహనమయ్యారు. మృతి చెందిన వారిని గుర్తించడం అసాధ్యంగా మారింది. మరో వైపు పేలుడు కారణంగా ఆ ప్రాంతంలోని సుమారు 40 ఇళ్లు కాలిపోయాయని డిప్యూటీ మేయర్‌ అల్మోనోర్ చెప్పారు. ఆ ఇళ్లలో ఉన్న బాధితుల సంఖ్యపై తాము ఇప్పుడే వివరాలు చెప్పలేమని అన్నారు.

Read More : UK Woman : బిడ్డ కోసం బతికింది, కోమాలో ఉన్న మహిళకు డెలివరీ

క్షతగాత్రులను సమీపంలోని జస్టినియన్ యూనివర్శిటీ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ హాస్పిటల్‌ కిక్కిరిసిపోయింది. తీవ్రంగా కాలిపోయిన వ్యక్తుల సంఖ్య పెరగడంతో చికిత్స చేయడం కష్టంగా మారుతోందని వైద్యులు చెప్తున్నారు. గాయాలైన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరణాలు మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు.

Read More : AP PRC : పీఆర్సీపై ఉత్కంఠ, ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ

గ్యాస్‌ ట్యాంకర్‌ ఒక బైక్‌ను తప్పించపోయి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్యాస్‌ను సేకరించేందుకు అక్కడి ప్రజలు పరుగులు తీశారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.