Virat Kohli : న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌.. అరుదైన రికార్డు పై విరాట్ కోహ్లీ క‌న్ను..

భార‌త జ‌ట్టు న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది.

Virat Kohli Just 53 Runs Away from Joining Elite 9000 Run Club in Tests

భార‌త జ‌ట్టు న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. బెంగ‌ళూరు వేదిక‌గా కివీస్‌, భార‌త్ మ‌ధ్య బుధ‌వారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుపై క‌న్నేశాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ మ‌రో 53 ప‌రుగులు చేస్తే టెస్టు క్రికెట్‌లో 9 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు.

టీమ్ఇండియా త‌రుపున ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు ఆట‌గాళ్లు స‌చిన్ టెండూల్క‌ర్ (15,921), రాహుల్ ద్ర‌విడ్‌(13,265), సునీల్ గ‌వాస్క‌ర్ (10,122)లు మాత్ర‌మే టెస్టుల్లో 9వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నారు. కోహ్లీ నాలుగో స్థానంలో నిల‌వ‌నున్నాడు.

IND vs NZ 1st Test : బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ తొలి టెస్టు.. టీమ్ఇండియా అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌

కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు 115 టెస్టులు ఆడాడు. 8947 ప‌రుగులు చేశాడు. ఇందులో 29 సెంచ‌రీలు, 30 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

కోహ్లీ పై గంభీర్ కామెంట్స్‌..

ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ తిరిగి పుంజుకుంటాడ‌ని, రానున్న సిరీసుల్లో అత‌డు ఫామ్‌లోకి వ‌స్తాడ‌ని హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు. కోహ్లీ ప‌రుగుల ఆక‌లితో ఉన్నాడ‌ని అన్నాడు. అత‌డో ప్ర‌పంచ స్థాయి ఆట‌గాడని కితాబు ఇచ్చాడు. కివీస్‌తో సిరీస్‌లో ప‌రుగులు చేయాల‌నే త‌ప‌న‌తోనే అత‌డు ఉన్నాడ‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. ఆ త‌రువాత ఆస్ట్రేలియా సిరీస్‌పై దృష్టి సారించ‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు.

IND vs NZ : భార‌త్‌తో తొలి టెస్టుకు ముందే న్యూజిలాండ్‌కు భారీ షాక్‌..