Virat Kohli need 94 runs to became Indian player most runs against New Zealand in ODIs
Virat Kohli : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జనవరి 11 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు వడోదరకు చేరుకుని ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి. కాగా.. ఈ సిరీస్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
కివీస్ పై వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో 94 పరుగులు చేస్తే.. ఆ జట్టు పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
Bangladesh cricketers : స్పాన్సర్‌షిప్ కోల్పోనున్న బంగ్లా ప్లేయర్లు..?
సచిన్ 41 ఇన్నింగ్స్‌ల్లో 46.05 సగటుతో 1750 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 8 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లీ విషయాన్ని వస్తే.. ఇప్పటి వరకు అతడు 33 ఇన్నింగ్స్‌ల్లో 55.23 సగటుతో 1657 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, తొమ్మిది అర్థశతకాలు ఉన్నాయి.
ఇక ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు కివీస్ పై 23 ఇన్నింగ్స్‌ల్లోనే 52.59 సగటుతో 1157 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, మూడు అర్థశతకాలు ఉన్నాయి.
WPL 2026 : ముంబై వర్సెస్ బెంగళూరు.. పిచ్ రిపోర్టు, హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే..
వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ – 1750 పరుగులు
* విరాట్ కోహ్లీ – 1657 పరుగులు
* వీరేంద్ర సెహ్వాగ్ – 1157 పరుగులు
* మహ్మద్ అజారుద్దీన్ – 1118 పరుగులు
* సౌరవ్ గంగూలీ – 1079 పరుగులు