Virat Kohli retire Former India bowling coach tells behind the scenes
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం ఇంగ్లాండ్ సిరీస్ అయినా ఆడాల్సి ఉందని అంటున్నారు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే.. కోహ్లీ రిటైర్‌మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలకడం కోహ్లీ నిస్వార్థ నియం అని అభివర్ణించాడు. సుధీర్ఘ ఫార్మాట్‌లో ఇక పై అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేమని కోహ్లీ, రోహిత్ శర్మలు భావించారని తెలిపాడు.
‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లు టెస్ట్ క్రికెట్‌లో తాము ఇకపై అత్యుత్తమంగా ఆడలేమని తెలుసుకున్నారని, అది వారి రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు.’ అని పరాస్ మాంబ్రే అన్నారు. మరో ఐదు సంవత్సరాలు ఆడాలని కోహ్లీ అనుకోలేదని, రిటైర్‌మెంట్‌కు ఇదే సరైన సమయం అని భావించాడని అన్నారు.
ENG vs IND : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు.. లండన్‌లోని కోహ్లీ ఇంటికి గిల్, పంత్, సిరాజ్ ఇంకా..
‘వారిద్దరు భారత్ క్రికెట్‌కు ఎంతో చేశారన్నాడు. జట్టుకు ప్రేరణగా నిలిచారని చెప్పాడు. టెస్టు ఫార్మాట్ లో అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వలేమని భావించొచ్చు. మెరుగైన ప్రదర్శన చేయలేనప్పుడు తప్పుకోవడం మంచిది అని వారు అనుకుంటూ ఉంటారు. వారు పాటించే విధానం అదే. కాబట్టి ఈ ఇద్దరూ జట్టు కోసం తీసుకున్న నిస్వార్థ నిర్ణయం.’ అని మాంబ్రే అన్నాడు.
రోకో ద్వయం టెస్టులు, టీ20ల నుంచి తప్పుకున్న విషయం పై మాట్లాడుతూ.. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ పూర్తిగా వన్డేలపై దృష్టి పెట్టడానికి వారి నిర్ణయం సాయం చేస్తుందన్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతుండగా మే 7న రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. హిట్‌మ్యాన్ తన నిర్ణయం తెలిపిన ఐదు రోజుల తరువాత కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 ముందు దిగ్గజ ఆటగాళ్ల రిటైర్‌మెంట్లు అభిమానులను భావోద్వేగానికి గురి చేశాయి. గిల్ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జూన్ 20 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తోనే టీమ్ఇండియా డబ్ల్యూటీసీ నాలుగో సైకిల్ ప్రారంభం కానుంది.