Virat Kohli : 8 ఏళ్ల త‌రువాత వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన కోహ్లీ.. మ‌రోసారి విఫ‌లం..

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ 8 ఏళ్ల విరామం త‌రువాత టెస్టుల్లో మూడో స్థానంలో బ‌రిలోకి దిగాడు.

Virat Kohli return to No 3 after 8 years and out for duck

Virat Kohli : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ 8 ఏళ్ల విరామం త‌రువాత టెస్టుల్లో మూడో స్థానంలో బ‌రిలోకి దిగాడు. న్యూజిలాండ్‌తో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ ఔటైన త‌రువాత కోహ్లీ బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. 9 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ ఒక్క ప‌రుగు కూడా చేయ‌కుండా డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. విలియ‌మ్ ఓ రూర్కీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ అద్భుత‌మైన క్యాచ్ అందుకోవ‌డంతో విరాట్ ఔట్ అయ్యాడు.

సాధార‌ణంగా కోహ్లీ టెస్టుల్లో నాలుగో స్థానం (సెకండ్ డౌన్‌)లో బ్యాటింగ్‌కు వ‌స్తాడు. అయితే.. పూర్తి ఫిట్‌గా లేక‌పోవడంతో కివీస్‌తో తొలి మ్యాచ్‌లో శుభ్‌మ‌న్ గిల్ ఆడ‌డం లేదు. దీంతో కోహ్లీ మూడో స్థానంలో బ‌రిలోకి వ‌చ్చాడు. ఈస్థానంలో మ‌రోసారి కోహ్లీ నిరాశ‌ప‌రిచాడు. కోహ్లీ చివరిసారిగా 2016లో వెస్టిండీస్‌పై నెం.3లో బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచులో కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లో 3,4 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

IND vs NZ : న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. శుభ్‌మ‌న్ గిల్ ఎందుకు ఆడ‌డం లేదో తెలుసా?

త‌న కెరీర్‌లో కోహ్లీ టెస్టుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు మ్యాచుల్లోనే ఈ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 16.16 స‌గ‌టుతో 97 ప‌రుగులు మాత్ర‌మే సాధించాడు. అత్య‌ధిక స్కోరు 41 ప‌రుగులు మాత్ర‌మే.

చెత్త రికార్డు..
ఈ మ్యాచ్‌లో కోహ్లీ డ‌కౌట్ కావ‌డంతో ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి ఇది 38వ డ‌కౌట్‌. ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో టీమ్ సౌథీ (38)తో స‌మానంగా కోహ్లీ ఉన్నాడు. ఇక ఓవ‌రాల్‌గా అన్ని ఫార్మాట్ల‌లో ముత్తయ్య ముర‌ళీ ధ‌ర‌న్ 59 డ‌కౌట్ల‌లో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

SRH : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు షాక్‌.. డేల్ స్టెయిన్ సంచ‌ల‌న నిర్ణ‌యం..

బెంగ‌ళూరు టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌కు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (2), విరాట్ కోహ్లీ (0), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (0) అయ్యారు. దీంతో భార‌త్ 10 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయింది.