Virushka : ‘మై రాక్’‌.. విరుష్క జోడి క్యూట్ ఫొటో వైరల్..!

విరాట్ కోహ్లీ, సతీమణి అనుష్క శర్మతో కలిసి సరదాగా దిగిన క్యూట్ ఫొటోను షేర్ చేశారు. ఇప్పుడా ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Virushka : ‘మై రాక్’‌.. విరుష్క జోడి క్యూట్ ఫొటో వైరల్..!

Virat Kohli Shares Adorable Photo With Wife Anushka Sharma, Calls Her My Rock

Updated On : November 21, 2021 / 6:17 PM IST

Virushka : విరాట్ కోహ్లీ, సతీమణి అనుష్క శర్మతో కలిసి సరదాగా దిగిన ఓ క్యూట్ ఫొటోను షేర్ చేశారు. ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మైక్రో బ్లాగింగ్ యాప్ Kooలో విరాట్ షేర్ చేస్తూ.. My Rock అంటూ రెడ్ హార్ట్ ఎమోజీతో క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫొటోలో కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ వైట్ టీషర్ట్ తో మెరిసిపోతున్నారు. మార్నింగ్ వైబ్స్ పేరుతో ఇద్దరు ఫొటోకు ఫోజిచ్చారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన 45నిమిషాల్లోనే 600 మంది లైక్ చేశారు. పవర్ కపుల్ అంటూ విరుష్క జంటను నెటిజన్లు ప్రశంసించగా.. మరికొందరు నైస్ పిక్, లవ్ లీ, సూపర్బ్, అమేజింగ్ అంటూ కామెంట్లు పెట్టారు. మరో యూజర్ ఆల్ టైం ఫేవరేట్ అంటూ #virushka హ్యాష్ ట్యాగ్ జోడించాడు.

Koo App

ఇప్పటికే టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఈ సమయాన్ని తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నాడు. ఏబీ డివిలియర్స్‌ అన్ని రకాల ఫార్మాట్స్‌ నుంచి తప్పుకోవడంతో కోహ్లి స్పందించిన సంగతి తెలిసిందే. ఐ లవ్‌ యూ ఏబీ.. నా గుండె ముక్కలయ్యిందని కోహ్లీ పోస్ట్‌ చేశాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు విరాట్ జట్టులో చేరే అవకాశం ఉంది.