Virat Kohli : రాజస్థాన్‌పై ఓటమి.. ఒంటరిగా డగౌట్‌లో కూర్చోన్న కోహ్లి.. బెంగళూరు డ్రెస్సింగ్ రూమ్‌లో సంజూశాంసన్
మ్యాచ్ ఓడిపోయిన అనంతరం కోహ్లి మైదానంలోని డగౌట్‌లో ఒంటరిగా కూర్చోన్నాడు
- Thota Vamshi Kumar
- Published On : April 7, 2024 / 02:07 PM IST
screengrab from video posted on x by @RCB
Virat Kohli sits alone : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఐపీఎల్ 2024 సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఐదు మ్యాచుల్లో 316 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. శనివారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి వరుసగా మూడో ఓటమి కాగా.. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగో ఓటమి కావడం గమనార్హం.
ఈ మ్యాచ్ లో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో కోహ్లి(113 నాటౌట్; 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ బాదగా, డుప్లెసిస్ (44; 33 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్సర్లు) రాణించాడు. ఈ లక్ష్యాన్ని ఆర్ఆర్ 19.1వ ఓవర్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్ఆర్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (100నాటౌట్; 58 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్లు) శతకంతో చెలరేగగా సంజు శాంసన్ (69; 42 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
Jos Buttler Century : ఆఖర్లో బట్లర్ సెంచరీ పై ఉత్కంఠ.. షిమ్రాన్ హెట్మెయర్ సలహాతో పూర్తి..
ఒంటరిగా కోహ్లి..
కాగా.. మ్యాచ్ ఓడిపోయిన అనంతరం కోహ్లి మైదానంలోని డగౌట్‌లో ఒంటరిగా కూర్చోన్నాడు. అతడి ముఖంలో బాధ చాలా సుస్పష్టంగా కనబడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజుశాంసన్ ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి ఆటగాళ్లను ఓదార్చడం కూడా కనిపించింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.
ముంబైకి ఒక్కడే..
ఆర్‌సీబీ తన తదుపరి మ్యాచ్‌లో ముంబైఇండియన్స్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ఏప్రిల్ 11 గురువారం ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో జైపూర్ నుంచి జట్టు సభ్యులతో కాకుండా కోహ్లి ఒక్కడే ముంబైకి వెళ్లనున్నాడు. అతడు ఎందుకు అలా వెళ్లాలని అనుకున్నాడో కారణం తెలియరాలేదు.
Virat Kohli : కోహ్లి ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే స్లోయెస్ట్ సెంచరీ..
