IND vs AUS Test : సిక్స్ కొట్టి ఆందోళన చెందిన విరాట్ కోహ్లీ.. బాల్ ఎవరికి తాకిందో తెలుసా.. వీడియో వైరల్

మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ సూపర్ సిక్స్ కొట్టాడు. బ్యాక్ వర్డ్ పాయింట్ నుంచి బౌండరీ బయటకు బాల్ ను తరలించాడు. బాల్ నేరుగా వెళ్లి

Virat kohli

Virat Kohli: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మూడో రోజు (ఆదివారం) ఆటలో భాగంగా భారత్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు కోల్పోయి మూడోరోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి 359 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. అయితే, విరాట్ కోహ్లీ కొట్టిన సూపర్ సిక్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Also Read: AUS vs IND : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. యశస్వీ జైస్వాల్ సెంచరీ

మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ సూపర్ సిక్స్ కొట్టాడు. బ్యాక్ వర్డ్ పాయింట్ నుంచి బౌండరీ బయటకు బాల్ ను తరలించాడు. బాల్ నేరుగా వెళ్లి బౌండరీ లైన్ అవతల పడింది. ఆ తరువాత బౌన్స్ అయ్యి సెక్యూరిటీ గార్డు తలకు బలంగా తాకింది. వెంటనే అతని వద్దకు ఆస్ట్రేలియా ప్లేయర్ నాథన్ లైయన్, ఆసీస్ ఫీజియో వెళ్లారు. అతని బాల్ తగలడంతో విరాట్ కోహ్లీ ఆందోళన చెందాడు. అయితే, బాల్ నేరుగా కాకుండా.. సెప్ట్ పడి అతని తలకు తాకింది. దీంతో పెద్దగా ఇబ్బంది లేదని చెప్పడంతో విరాట్ కోహ్లీ ఊపిరిపీల్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Also Read: Yashasvi Jaiswal : సిక్స‌ర్ల కింగ్ య‌శ‌స్వి జైస్వాల్‌.. బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ రికార్డు బ్రేక్‌.. ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు..

మూడోరోజు ఆటలో యశస్వీ జైస్వాల్ సెంచరీ చేశాడు. 297 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 161 పరుగులు చేశాడు. అందులో 15ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. మిచెల్ మార్ష్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ రూపంలో జైస్వాల్ పెవిలియన్ బాటపట్టాడు. అంతకుముందే కేఎల్ రాహుల్ (179 బంతుల్లో 77 పరుగులు) ఔట్ అయ్యాడు. ఆ తరువాత దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు. హేజిల్ వుడ్ వేసిన బంతిని ఆడబోయి స్లిప్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి దేవదత్ పడిక్కల్ (25) ఔట్ అయ్యాడు. ఆ తరువాత విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. కొద్ది సేపటికి మార్ష్ బౌలింగ్ జైస్వాల్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ వచ్చాడు. నాథన్ లైయన్ బౌలింగ్ ముందుకొచ్చి ఆడబోయిన రిషబ్ పంత్ (1) స్టంపౌట్ తో పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత క్రీజులోకి ధ్రువ్ జురెల్ వచ్చాడు. పాట్ కమిన్స్ బౌలింగ్ ధ్రువ్ జురెల్ (1) ఎల్బీగా పెవిలియన్ కు చేరాడు. ఆ తరుత వాసింగ్టన్ సుందర్ క్రీజులో వచ్చాడు. కోహ్లీ, సుందర్ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు. దీంతో మూడోరోజు ఆటలో టీం బ్రేక్ సమయానికి 107 ఓవర్లకు భారత్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం 401 చేరింది.