Virat Kohli retirement : ఐపీఎల్ నుంచి ఆ రోజే త‌ప్పుకుంటా.. రిటైర్‌మెంట్ గురించి చికారాతో విరాట్ కోహ్లీ ఏం చెప్పాడు ?

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ (Virat Kohli retirement) ప్ర‌ణాళిక‌పై ఆర్‌సీబీ ఆట‌గాడు స్వ‌స్తిక్ చికారా స్ప‌ష్టత నిచ్చాడు.

Virat Kohli to quit IPL the day he plays as Impact Player

Virat Kohli retirement : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీకి క్రికెట్ ప‌ట్ల ఉన్న అంకిత‌భావం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న బ్యాటింగ్‌తోనే కాకుండా, కెప్టెన్‌గా, ఆట‌గాడిగా జ‌ట్టుకు ఎన్నో విజ‌యాల‌ను అందించాడు.

ఇక మైదానంలో దిగిన ప్ర‌తీసారి కూడా త‌న జ‌ట్టు గెలిచేందుకు శాయ‌శ‌క్తుల కృషి చేస్తాడు. ఇక యువ ఆట‌గాళ్ల‌తో కూడా కోహ్లీ ఎంతో బాగా క‌లిసిపోతాడు.

ఇందుకు ఐపీఎల్ 2025 నిద‌ర్శ‌నం. ఆర్‌సీబీ జ‌ట్టులోని 20 ఏళ్ల స్వ‌స్తిక్ చికారాతో కోహ్లీ వ్య‌వ‌హ‌రించిన తీరే నిద‌ర్శ‌నం.

ఐపీఎల్ ఆరంభం 2008 నుంచి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) జ‌ట్టుకే కోహ్లీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఆర్‌సీబీ విజేత‌గా నిలిచింది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ఇదే తొలి టైటిల్ అన్న సంగ‌తి తెలిసిందే.

ఈ స‌మ‌యంలో కోహ్లీ భావోద్వేగానికి లోనైయ్యాడు. ఈ స‌మ‌యంలో కోహ్లీ ద‌గ్గ‌ర‌కు మొద‌ట‌గా వెళ్లిన వ్య‌క్తి స్వ‌స్తిక్ చికారా.

BCCI : రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ పై బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 స‌మ‌యానికి కోహ్లీకి 37 సంవత్సరాలు నిండుతాయి. కొత్త సీజన్‌కు ముందు, కోహ్లీ సహచరుడు స్వస్తిక్ చికారా మాజీ ఆర్‌సిబి కెప్టెన్ పదవీ విరమణ (Virat Kohli retirement) ప్రణాళికలపై స్ప‌ష్ట‌త నిచ్చాడు.

రెవ్‌స్పోర్ట్జ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చికారా మాట్లాడుతూ.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మ్యాచ్ ఆడే రోజు రిటైర్ అవుతానని కోహ్లీ తనకు చెప్పాడని వెల్ల‌డించాడు.

తాను ఫిట్‌గా ఉంటేనే క్రికెట్ ఆడుతానని చెప్పిన‌ట్లు తెలిపాడు. మైదానంలో 20 ఓవర్లు ఫీల్డింగ్ చేసి, ఆ తర్వాత బ్యాటింగ్ చేయాలి. అలా కాకుండా ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కేవ‌లం బ్యాటింగ్ చేసే రోజు వ‌స్తే మాత్రం ఆ రోజు క్రికెట్‌ను వ‌దిలేస్తా. అని కోహ్లీ త‌న‌కు చెప్పిన‌ట్లు చికారా అన్నాడు.

CPL 2025 : షిమ్రాన్ ఏమా కొట్టుడు సామీ.. నీకు తోడుగా షైహోప్‌, షెపర్డ్ కూడానా.. తాహిర్ పాంచ్ ప‌టాకా..

వ‌న్డేల్లో మాత్ర‌మే..

ఇదిలా ఉంటే.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ప్ర‌స్తుతం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్నాడు. టెస్టుల‌కు, టీ20ల‌కు వీడ్కోలు ప‌లికాడు. అక్టోబ‌ర్ లో భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించ‌నుంది.

ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌తో పాటు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌నుంది. వ‌న్డే సిరీస్ అక్టోబ‌ర్ 19 నుంచి ప్రారంభం కానుంది. కాగా.. ఈ వ‌న్డే సిరీసే కోహ్లీకి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆఖ‌రి సిరీస్ అని వార్త‌లు వ‌స్తున్నాయి.