BCCI : రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ పై బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా కామెంట్స్‌..

రో-కో ద్వ‌యం రిటైర్‌మెంట్ వార్త‌ల బీసీసీఐ (BCCI ) ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. అస‌లు ఇలాంటివి..

BCCI : రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ పై బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా కామెంట్స్‌..

Rohit and virat not retiring says BCCI vice-president Rajeev Shukla

Updated On : August 23, 2025 / 11:13 AM IST

BCCI :  టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌కు ఆస్ట్రేలియా వేదిక‌గా అక్టోబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న మూడు మ్యాచ్‌ల వ‌న్డేల సిరీసే ఆఖ‌ద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆసీస్‌తో వ‌న్డే సిరీస్ త‌రువాత రోహిత్, కోహ్లీలు రిటైర్‌మెంట్ అవుతార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే వీరిద్ద‌రు టెస్టులు, టీ20ల‌కు వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే.

రో-కో ద్వ‌యం రిటైర్‌మెంట్ వార్త‌లపై బీసీసీఐ (BCCI ) ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. అవ‌న్నీ వ‌ట్టి పుకార్లేన‌ని చెప్పాడు. అస‌లు ఇలాంటివి ఎలా పుట్టుకొస్తాయో అర్థంకావ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌కు ఓ ప్ర‌శ్న ఎదురైంది. స‌చిన్ టెండూల్క‌ర్‌లాగానే రో-కో ద్వ‌యానికి ప్ర‌త్యేకంగా ఫేర్‌వెల్ నిర్వ‌హిస్తారా ? అని హోస్ట్ ప్ర‌శ్నించాడు.

CPL 2025 : షిమ్రాన్ ఏమా కొట్టుడు సామీ.. నీకు తోడుగా షైహోప్‌, షెపర్డ్ కూడానా.. తాహిర్ పాంచ్ ప‌టాకా..

దీనికి రాజీవ్ శుక్లా ఇలా స‌మాధానం ఇచ్చాడు. వారిద్ద‌రు ఎప్పుడు రిటైర్ అవుతున్నారు? అని ప్ర‌శ్నించాడు. రో-కో ద్వ‌యం ఇప్ప‌టికి కూడా వ‌న్డేలు ఆడుతున్నార‌న్నాడు. ఆసీస్‌తో సిరీసే ఎందుకు వీడ్కోలు అవుతుంది? వారి రిటైర్‌మెంట్ గురించి మీరంతా ఎందుకు ఆందోళ‌న చెందుతున్నారు? బీసీసీఐ ఎవ‌రిని కూడా రిటైర్‌మెంట్ క‌మ్మ‌ని చెప్ప‌దు. ఆట‌గాడు స్వ‌త‌హాగా నిర్ణ‌యం తీసుకుంటాడు. ప్లేయ‌ర్ తీసుకునే నిర్ణ‌యాన్ని ఎవరైనా గౌర‌వించాల్సిందే. అని శుక్లా అన్నాడు.

SA20 : పీయూష్ చావ్లా నుంచి సిద్దార్థ్ కౌల్ వ‌ర‌కు.. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడేందుకు క్యూ క‌డుతున్న భార‌త ఆట‌గాళ్లు..

విరాట్ కోహ్లీ చాలా ఫిట్‌గా ఉన్నాడ‌ని చెప్పుకొచ్చాడు. అదే స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ చాలా బాగా ఆడుతున్నాడ‌న్నారు. అయితే.. మీరు వీడ్కోలు గురించి ఎందుకు మాట్లాడుతారు అని రాజీవ్ శుక్లా అన్నాడు

అక్టోబ‌ర్‌లో భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో భార‌త్ మూడు వ‌న్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది. వ‌న్డే సిరీస్ అక్టోబ‌ర్ 19 నుంచి ప్రారంభం కానుంది.