Virat Kohli : క్రికెట్‌కు దూరంగాఉన్నా కోట్లు సంపాదిస్తున్న కోహ్లీ..ఎలాగో తెలుసా?

ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. ప్రతీయేటా అతని నికర ఆస్తుల విలువ భారీగా పెరుగుతోంది.

Virat Kohli

Virat Kohli Net Worth : ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. ప్రతీయేటా అతని నికర ఆస్తుల విలువ భారీగా పెరుగుతోంది. కొద్ది నెలలుగా విరాట్ కోహ్లీ క్రికెట్ కు దూరంగా ఉంటున్నారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా బీసీసీఐ అనుమతితో కోహ్లీ ఇంటికే పరిమితమయ్యారు. మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ -2024లో ఆర్సీబీ జట్టు ప్లేయర్ గా కోహ్లీ మైదానంలోకి అడుగు పెట్టనున్నారు. ఆ తరువాత జరిగే టీ20 వరల్డ్ కప్ కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇదిలాఉంటే కోహ్లీ కొద్ది నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్నా అతని నికర ఆస్తుల విలువ ఏ మాత్రం తగ్గలేదు.

Also Read : శ‌త‌క్కొట్టిన రోహిత్ శ‌ర్మ‌.. సెంచ‌రీ నంబ‌ర్ 48.. జోరూట్ రికార్డ్ బ్రేక్‌..

నివేదికల ప్రకారం.. విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ 2014 నుంచి పోల్చుకుంటూ అమాంతం పెరుగుతూ వస్తోంది. 2014లో అతని నికర ఆస్తుల విలువ రూ. 425 కోట్లు అయితే.. ఇప్పుడు రూ. 1090 కోట్ల వరకు చేరింది. కేవలం క్రికెట్ మ్యాచ్ లు, బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి మాత్రమే కోహ్లీకి కోట్లాది రూపాయలు వస్తున్నాయి. విరాట్ బీసీసీఐ ఏ-ప్లస్ గ్రేడ్ హోదాను కలిగి ఉన్నాడు. సంవత్సరానికి 7కోట్లు అందుకుంటున్నాడు. దీనికితోడు టెస్ట్ మ్యాచ్ కు రూ. 15లక్షలు, వన్డేకు రూ. 3లక్షలు, టీ20 మ్యాచ్ కు రూ. 3లక్షలు అందుకుంటాడు. టీ20 లీగ్ ఐపీఎల్ ద్వారా యేటా రూ. 15కోట్లు వస్తాయి.

Also Read : IND vs ENG 5th Test : ముగిసిన రెండో రోజు ఆట‌

కేవలం బీసీసీఐ కాంట్రాక్ట్ తోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్, ట్విటర్ ద్వారా కూడా కోహ్లీకి భారీగా ఆదాయం వస్తుంది. కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో 266 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇందులో కోహ్లీ ఒక్క పోస్టుకు రూ. 8.9 కోట్లు వరకు సంపాదిస్తున్నాడు. ఎక్స్ పేజీలో 61 మిలియన్ల మంది కోహ్లీని అనుసరిస్తున్నారు. ఎక్స్ ఖాతాలో ఒక్క పోస్టు పెడితే రూ. 2.5కోట్లు అందుకుంటున్నాడు. అనేక ప్రముఖ కంపెనీలకు కోహ్లీ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉంటూ రూ.7.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు కోహ్లీ సంపాదిస్తున్నాడు. కోహ్లీ వద్ద అనేక రకాల కార్లు ఉన్నాయి. ఆ కార్ల మొత్తం విలువ రూ. 147కోట్లు. అంతేకాక రూ. 140 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్, విలాసవంతమైన గృహాలు కోహ్లీకి ఉన్నాయి. వీటికితోడు కోహ్లీకి పలు వ్యాపారాల్లో పెట్టుబడులు ఉన్నాయి. మొత్తం మీద ఈ ఏడాది (2024)లో విరాట్ కోహ్లీ నికర విలువ రూ. 1090 కోట్లు అని నివేదికలు పేర్కొంటున్నాయి.

 

 

 

ట్రెండింగ్ వార్తలు