Axar Patel- Virat Kohli
Axar Patel- Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టుకు ఎదురే లేదు. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ లలో నెగ్గిన రోహిత్ సేన ఆధిపత్యాన్ని చాటింది. ఆదివారం న్యూజిలాండ్ జట్టుపై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్-ఎ విభాగం నుంచి పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంకు చేరుకుంది. దీంతో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా జట్టుతో మంగళవారం సెమీస్ లో తలపడుతుంది. ఇదిలాఉంటే ఇండియా వర్సెస్ కివీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్, అక్షర్ పటేల్ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Champions Trophy: సెమీ ఫైనల్స్‌కు ముందు ఆస్ట్రేలియాకు రోహిత్ శర్మ స్వీట్ వార్నింగ్… ఏమన్నాడంటే..
భారత్ జట్టు స్పిన్నర్ల దాటికి కివీస్ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయారు. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించారు. కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. అక్షర్, జడేజా, హార్దిక్ పాండ్యాలు ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. అక్షర్ పటేల్ పది ఓవర్లు వేయగా.. చివరి బంతికి కీలకమైన విలియమ్సన్ వికెట్ పడగొట్టాడు. అప్పటికే విలియమ్సన్ 81 పరుగులతో క్రీజులో పాతుకుపోయాడు. అక్షర్ వేసిన బంతికి ముందుకొచ్చి ఆడే ప్రయత్నంలో బాల్ మిస్ అయ్యి కీపర్ కేఎల్ రాహుల్ చేతిలోకి వెళ్లింది.. వెంటనే రాహుల్ స్టంపౌట్ చేయడంతో విలియమ్సన్ పెవిలియన్ బాటపట్టాడు. ఈ సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
విలియమ్సన్ ను అవుట్ చేసిన అనంతరం విరాట్ కోహ్లీ వేగంగా అక్షర్ పటేల్ వద్దకు వెళ్లి అతని కాళ్లను టచ్ చేసే ప్రయత్నం చేశాడు.. దీంతో అలర్ట్ అయిన అక్షర్ నవ్వుతూ కిందకూర్చొని విరాట్ ను గట్టిగా పట్టుకున్నారు. అనంతరం ఇద్దరు ప్లేయర్లు పైకిలేచి జట్టు సభ్యులతో సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు. అక్షర్ పటేల్ ను ఆటపట్టించేందుకు కోహ్లీ చేసిన సరదా సన్నివేశాన్ని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Kohli touching Axar Patel’s feet after he got Williamson out 😭#Kohli #AxarPatel #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/mJmgQ95Y15
— voodoo mama juju (@ayotarun) March 2, 2025