Champions Trophy: వావ్.. బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్.. స్టేడియం దద్దరిల్లిపోయింది.. వీడియో వైరల్
న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ బౌండరీ లైన్ వద్ద సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లిపోయింది..

Axar Patel
IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టుకు ఎదురే లేదు. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ లలో నెగ్గిన రోహిత్ సేన ఆధిపత్యాన్ని చాటింది. ఆదివారం న్యూజిలాండ్ జట్టుపై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్-ఎ విభాగం నుంచి పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంకు చేరుకుంది. దీంతో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా జట్టుతో మంగళవారం సెమీస్ లో తలపడుతుంది. ఇదిలాఉంటే ఇండియా వర్సెస్ కివీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్ పట్టాడు. దీంతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Also Read: Champions Trophy: సెమీ ఫైనల్స్‌కు ముందు ఆస్ట్రేలియాకు రోహిత్ శర్మ స్వీట్ వార్నింగ్… ఏమన్నాడంటే..
న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. ఛేజింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు కేవలం 205 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ జట్టు స్పిన్నర్ల మాయాజాలంకు న్యూజిలాండ్ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయారు. విలియమ్సన్ (81 పరుగులు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు.
న్యూజిలాండ్ 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా వేసిన మూడో ఓవర్లో చివరి బంతికి రచిన్ రవీంద్ర భారీ షాట్ కొట్టాడు. డీప్ థర్డ్ లో బౌండరీ లైన్ వద్ద బాల్ పడుతున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన అక్షర్ పటేల్ సూపర్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. దీంతో రచిన్ కేవలం 6 పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. అక్షర్ క్యాచ్ అందుకోగానే భారత అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
WHAT A GRAB BY AXAR PATEL. 🌟pic.twitter.com/kLXEoTvmtV
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 2, 2025