IND vs NZ : సింపుల్ క్యాచ్‌ను మిస్ చేసిన రోహిత్ శ‌ర్మ‌.. విరాట్ కోహ్లీ రియాక్ష‌న్ వైర‌ల్‌

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భార‌త్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మకు ఏదీ క‌లిసి రావ‌డం లేదు

Virat Kohli unleashes his anger on Rohit Sharma after he dropped a easy catch

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భార‌త్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మకు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. తొలి టెస్టు ఓట‌మి నేప‌థ్యంలో రెండో టెస్టు మ్యాచ్‌లో త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. పూణే వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లోనూ రోహిత్ త‌డ‌బాటు కొన‌సాగుతోంది. సార‌థిగా విఫ‌ల‌మైన హిట్‌మ్యాన్ బ్యాటింగ్‌లో డ‌కౌట్ అయ్యాడు. ఇక ఫీల్డింగ్‌లో అయితే చాలా సుల‌భ‌మైన క్యాచ్‌ను వ‌దిలివేశాడు. దీన్ని చూసిన విరాట్ కోహ్లీ తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశాడు.

న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 37 ఓవ‌ర్‌ను ర‌వీంద్ర జడేజా వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతిని కివీస్ కెప్టెన్ టామ్ లాథ‌మ్ ఫ్రంట్ ఫూట్‌లో ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. స్లిప్ ఉన్న రోహిత్ శ‌ర్మ వైపుకు దూసుకువ‌చ్చింది.

IND vs NZ : రెండో టెస్టులో పట్టుబిగించిన న్యూజిలాండ్‌.. 301 పరుగుల లీడ్‌

రోహిత్ అప్ర‌మ‌త్తంగా లేక‌పోవ‌డంతో బంతిని అందుకోలేక‌పోయాడు. బంతి బౌండ‌రీకి వెళ్లింది. రోహిత్ క్యాచ్ మిస్ చేయ‌డంతో కోహ్లీ అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారింది. రోహిత్ శ‌ర్మ క్యాచ్ మిస్ చేసిన స‌మ‌యంలో లాథ‌మ్ 68 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద ఉన్నాడు. చివ‌రికి అత‌డు 86 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. 103 ప‌రుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్ రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 5 వికెట్లు కోల్పోయి 198 ప‌రుగులు చేసింది. టామ్ బ్లండెల్ (30), గ్లెన్ ఫిలిప్స్ (9) లు క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం కివీస్ 301 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 156 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 259 ప‌రుగులు చేసిన సంగ‌తి తెలిసిందే.

IND vs NZ : చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వి జైస్వాల్‌.. కోహ్లీ, రోహిత్, స‌చిన్‌, ధోని వ‌ల్ల కాలేదు..