×
Ad

Virat Kohli : ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డు.. 54 రన్స్ చేస్తే..

ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌లో కోహ్లీ (Virat Kohli ) 54 ప‌రుగులు సాధిస్తే వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో...

Virat Kohli will break huge record in australia by scoring 54 runs

Virat Kohli : టీ20లు, టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌కటించిన టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్నాడు. ఈ ఏడాది మార్చిలో దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో టీమ్ఇండియా త‌రుపున చివ‌రి సారిగా ఆడాడు. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌తో మైదానంలో అడుగుపెట్ట‌నున్నాడు.

అక్టోబ‌ర్ 19 నుంచి భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో కోహ్లీ (Virat Kohli) ఎలా రాణిస్తాడోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ సిరీస్‌లో కోహ్లీ 54 ప‌రుగులు సాధిస్తే వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు.

IND vs WI 2nd test : వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. కేఎల్ రాహుల్, ర‌వీంద్ర జ‌డేజాల‌ను ఊరిస్తున్న భారీ రికార్డులు ఇవే..

ఈ క్ర‌మంలో అత‌డు శ్రీలంక దిగ్గ‌జ ఆట‌గాడు కుమార సంగ‌క్క‌ర రికార్డును అధిగ‌మించ‌నున్నాడు. 404 వ‌న్డేల్లో 380 ఇన్నింగ్స్‌ల్లో 41.98 స‌గ‌టుతో 14234 ప‌రుగులను సంగ‌క్క‌ర చేశాడు. కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు 302 వ‌న్డేలు ఆడాడు. ఇందులో 290 ఇన్నింగ్స్‌ల్లో 57.88 స‌గ‌టుతో 14,181 ప‌రుగులు సాధించాడు.

ఇక ఈ జాబితాలో క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. 463 మ్యాచ్‌ల్లో 452 ఇన్నింగ్స్‌ల్లో 44.83 స‌గ‌టుతో 18,426 ప‌రుగులు సాధించాడు. ఇక వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన రికార్డు కోహ్లీ పేరిటే ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌న్డేల్లో కోహ్లీ 51 శ‌త‌కాలు చేశాడు.

వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

* స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్‌) – 463 మ్యాచ్‌ల్లో 18,426 ప‌రుగులు
* కుమార సంగ‌క్క‌ర (శ్రీలంక‌) – 404 మ్యాచ్‌ల్లో 14,234 ప‌రుగులు
* విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 302 మ్యాచ్‌ల్లో 14,181 ప‌రుగులు
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 375 మ్యాచ్‌ల్లో 13,704 ప‌రుగులు
* స‌న‌త్ జ‌య‌సూర్య (శ్రీలంక‌) – 445 మ్యాచ్‌ల్లో 13,430 ప‌రుగులు

Sidra Amin : భార‌త్ పై 81 ప‌రుగులు.. పాక్ ప్లేయ‌ర్‌ సిద్రా అమిన్‌కు ఐసీసీ భారీ షాక్‌.. మంద‌లించ‌డంతో పాటు..

వ‌న్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి వ‌న్డే – అక్టోబ‌ర్ 19 ( పెర్త్‌)
* రెండో వ‌న్డే – అక్టోబ‌ర్ 23 (అడిలైడ్)
* మూడో వ‌న్డే – అక్టోబ‌ర్ 25 (సిడ్నీ)