Virat Kohli Will miss these milestones If He Retires From Test Cricket
కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేశాడని, ఇంగ్లాండ్ పర్యటనకు తనను ఎంపిక చేయొద్దని కోరినట్లు సమాచారం. అయితే.. రోహిత్ శర్మ దూరమైన నేపథ్యంలో కోహ్లీ కూడా ఆడకపోతే ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ అనుభవలేమి జట్టును దెబ్బతీస్తుందని భావించిన బీసీసీఐ అతడిని వారిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి కోహ్లీ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడో లేదో చూడాలి.
ఒకవేళ కోహ్లీ తన నిర్ణయానికే కట్టుబడి ఉంటే.. టెస్టుల్లో అతడు పలు రికార్డులను కోల్పోయే అవకాశం ఉంది. అవి ఏమిటో ఓ సారి చూద్దాం..
ఇంగ్లాండ్ గడ్డ పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా..
ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఇంగ్లీష్ గడ్డపై సచిన్ 30 ఇన్నింగ్స్‌ల్లో 54 సగటుతో 1575 పరుగులు చేశాడు. ఇక విరాట్ విషయానికి వస్తే.. కోహ్లీ 17 టెస్టుల్లో 33 సగటుతో 1096 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనకు కోహ్లీ వెళ్తే 5 టెస్టుల్లో సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది.
టెస్టుల్లో 10 వేల పరుగులు..
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 123 టెస్టుల్లో 46.9 సగటుతో 9230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో కోహ్లీ మరో 770 పరుగులు చేస్తే 10 వేల పరుగులు మైలురాయిని చేరుకుంటాడు. ఒకవేళ అతడు ఇప్పటికిప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికితే 10వేల పరుగుల మైలురాయిని చేరుకోలేడు.
IPL 2025 : మే 16 నుంచే ఐపీఎల్..! నాలుగు వేదికల్లోనే మ్యాచ్‌లు..!
డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా..
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో టీమ్ఇండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లీకి మరో 100 పరుగులు అవసరం. ప్రస్తుతం ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ 40 మ్యాచ్‌ల్లో 2716 పరుగులు చేయగా కోహ్లీ 46 మ్యాచ్‌ల్లో 2617 రన్స్ సాధించాడు.