IND vs SA 1st Test : కోహ్లీ వచ్చేశాడు.. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్టుకు అందుబాటులో విరాట్

భారత్ - దక్షిణాఫ్రికా టెస్టుకు ముందు రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో అతని వేలికి గాయమైంది.

Virat Kohli

IND vs SA Test series: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ సెంచూరియన్ లో జరుగుతుంది. టెస్టు సిరీస్ కు ముందు పలువురు టీమిండియా ప్లేయర్స్ గాయాలబారిన పడటం ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు విరాట్ కోహ్లీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా భారత్ కు తిరిగొచ్చాడు. మొదటి టెస్టులో కోహ్లీ అందుబాటులో ఉండడని వార్తలు వచ్చాయి. అయితే, విరాట్ తొలి టెస్టుకు అందుబాటులో ఉంటారని తెలిసింది. కోహ్లీ భారత్ నుంచి తిరిగి వెళ్లాడని, దక్షిణాఫ్రికాలో టీం సభ్యులతో చేరినట్లు వార్తలు వచ్చాయి. కోహ్లీ ఫ్యామిలీ ఎమర్జెన్సీపై ఇండియాకు వెళ్లడం బీసీసీఐకి ముందే తెలుసు. అయితే, అతను తిరిగి రావడం జట్టుకు శుభపరిణామం.

Also Read : IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో మొద‌టి టెస్టుకు ముందు.. భార‌త్‌ను ఇబ్బంది పెడుతున్న రెండు అంశాలు ఇవే..?

భారత్ – దక్షిణాఫ్రికా టెస్టుకు ముందు రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో అతని వేలికి గాయమైంది. దీంతో మూడో వన్డేకు రుతురాజ్ దూరమయ్యాడు. ప్రస్తుతం అతని గాయం నయం కాకపోవడంతో టెస్టు సిరీస్ కు దూరమయ్యాడు. అతని గైర్హాజరీతో టీమిండియా అభిమన్యు ఈశ్వరన్ కు అవకాశం కల్పించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత్ -ఏ జట్టుకు కెప్టెన్ గా ఉన్న ఈశ్వరన్.. రెండో టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు. మరోవైపు కోలుకునే ప్రక్రియలో భాగంగా రుతురాజ్ జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు. మరోవైపు ఇషాన్ స్వయంగా తన పేరును సిరీస్ నుంచి ఉపసంహరించుకున్నాడు. దీంతో కేఎస్ భరత్ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఫిట్ నెస్ కారణంగా మహ్మద్ షమీ కూడా ఈ టెస్టులో ఆడటం లేదు.

Also Read : Virat Kohli : మూడు రోజుల్లో ద‌క్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌.. స్వ‌దేశానికి వ‌చ్చేసిన కోహ్లీ..! భార‌త్‌కు వ‌రుస షాక్‌లు..

భారత్ జట్టు :- రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, యశస్వీ జైస్ాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్ , కేఎల్. రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ర్పీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, కేఎల్. భరత్ (వికెట్ కీపర్).