VVS Laxman: ద్రవిడ్ స్థానంలో కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్: ఐర్లాండ్ టీ20 సిరీస్ కోసం

టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్టు టీంతో ఉండడం తప్పనిసరి కాగా, ఐర్లాండ్ పర్యటనకు లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నారు.

VVS Laxman: జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్..కోచ్‌గా మారనున్నారు. ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 మ్యాచ్‌లకు గానూ భారత టీం కోచ్‌గా లక్ష్మణ్ సేవలు అందించనున్నారు. కేవలం ఈ పర్యటన వరకు మాత్రమే లక్ష్మణ్ కోచ్‌గా భాద్యతలు నిర్వహించనున్నారు. జూన్ చివరి వారంలో భారత్ – ఐర్లాండ్ మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అదే సమయంలో ఇంగ్లీష్‌ కౌంటీ జట్టు లీసెస్టర్‌షైర్‌తో భారత్‌ ప్రాక్టీస్ మ్యాచ్‌ ఉండగా, వెనువెంటనే జులై 1 నుంచి 5వరకు వరకు ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌ (గతంలో వాయిదా పడిన ఐదో టెస్టు) జరగనుంది. ఈక్రమంలో టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్టు టీంతో ఉండడం తప్పనిసరి కాగా, ఐర్లాండ్ పర్యటనకు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.

Other Stories: IPL 2022: కేన్ మామ ఇక ఇంటికే.. ఇట్స్ ఏ గుడ్ న్యూస్ బ్రో!

జూన్‌ 9 నుంచి 19 వరకు దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత్ జట్టు..అనంతరం జూన్‌ 26, 28న ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడనుంది. అయితే గతంలోనూ సరిగా ఇటువంటి ఘటనే చోటుచేసుకోవడం విశేషం. గతంలో రవి శాస్త్రి టీం ఇండియా కోచ్‌గా సేవలు అందిస్తున్న సమయంలో..భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ జరిగింది. అదే సమయంలో ఐర్లాండ్‌తోనూ మరో మ్యాచ్ ఉండగా..రవిశాస్త్రి స్థానంలో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లారు. అనంతరం ద్రవిడ్ భారత జట్టు కోచ్‌గా పూర్తి స్థాయి భాద్యతలు తీసుకోగా, ఇప్పుడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ అదే తరహాలో పాక్షిక బాధ్యతలు చేపట్టనుండటం గమనార్హం. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లు 2001లో కోల్‌కతాలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో చారిత్రాత్మక భాగస్వామ్య ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు