IPL 2022: కేన్ మామ ఇక ఇంటికే.. ఇట్స్ ఏ గుడ్ న్యూస్ బ్రో!

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీంను వదిలి వెళ్లిపోతున్నాడు. స్వదేశంలో తన భార్య డెలివరీ అవుతున్న సమయంలో అక్కడే ఉండేందుకు గానూ వెళ్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని SRH ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ..

IPL 2022: కేన్ మామ ఇక ఇంటికే.. ఇట్స్ ఏ గుడ్ న్యూస్ బ్రో!

Kane Williamson

IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీంను వదిలి వెళ్లిపోతున్నాడు. స్వదేశంలో తన భార్య డెలివరీ అవుతున్న సమయంలో అక్కడే ఉండేందుకు గానూ వెళ్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని SRH ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. విలియమ్సన్ తన భార్య సారా రహీమ్ రెండో డెలివరీ కోసం స్వదేశానికి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు వాళ్ల పర్సనల్ కమిట్మెంట్ల కోసం ఐపీఎల్‌ బయో బబుల్ వదిలివెళ్లిపోయారు. ప్రస్తుతం ప్లేఆఫ్ రేసు నేపథ్యంలో కీలక ప్లేయర్లు దూరం కావడం టోర్నమెంట్ ఫలితాల మార్పులకు తావిచ్చేలా కనిపిస్తుంది.

“మా కెప్టెన్ కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ వెళ్లిపోతున్నారు. తన కుటుంబంలోకి రానున్న మరో వ్యక్తికి వెల్‌కమ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు. కేన్ విలియమ్సన్ సంతోషంగా ఉండాలని, అతని భార్యకు సేఫ్ డెలివరీ కావాలని కోరుకుంటున్నాం” SRH తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు.

Read Also : వార్నర్ క్రియేటివిటీ.. ఎన్టీఆర్‌గా కేన్ విలియమ్సన్.. చరణ్‌గా వార్నర్..!

విలియమ్సన్ 13 గేమ్‌లలో కేవలం 216 పరుగులతో 19.64 సగటుతో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. తన క్లాసిక్ ఆట తీరు ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. స్ట్రైక్ రేట్ 93.51 కూడా ఆరెంజ్ ఆర్మీకి ఎలాంటి బెనిఫిట్ రాలేదు.