Sachin Tendulkar Video: ఖతర్ లో ఫిఫా ప్రపంచ కప్ జరుగుతున్న వేళ ప్రస్తుతం భారత్ లోనూ ఆ ఆటపై అభిమానులు అమితాసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఓ వీడియో పోస్ట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇందులో సచిన్ ఫుట్ బాల్ ఆడుతున్నారు.
ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఖతర్ లో ఫిఫా ప్రపంచ కప్ థీమ్ ను కూడా ఆయన యాడ్ చేశారు. ‘‘నా మనసులో ఫుట్ బాల్ ఉంది’’ అని ఆయన చెప్పారు. బ్లూ టీషర్ట్ పై ఆరెంజ్ వెస్ట్, బ్లూ షార్ట్స్ వేసుకుని సచిన్ ఫుట్ బాల్ ఆడారు. ఫుట్ బాల్ ఆడుతూ ఆయన పలు ట్రిక్కులు ప్రదర్శించారు. సచిన్ పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సచిన్ అప్పట్లో క్రికెట్ కాకుండా ఫుట్ బాట్ పై దృష్టి పెట్టి ఉంటే మన దేశ జట్టు కూడా ఫిఫా ప్రపంచ కప్ లో ఆడేందుకు అర్హత సాధించేదని కొందరు పేర్కొన్నారు. ‘‘క్రికెట్ గాడ్ ఇప్పుడు ఫుట్ బాల్ గాడ్ గా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు’’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. సచిన్ టెండూల్కర్ లో ఈ నైపుణ్యం కూడా ఉందని తనకు ఇప్పుడే తెలిసిందని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
Redmi K60 Series : వచ్చే జనవరిలో రెడ్‌మి K60 సిరీస్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!