WBBL 2025 Adelaide Strikers vs Hobart Hurricanes match abandoned due to hole in the pitch
WBBL 2025 : క్రికెట్‌లో అప్పడప్పుడు వర్షం కారణంగానో లేదంటే మరేదైన కారణంగా మ్యాచ్ రద్దు కావడాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. ఓ బాల్ కారణంగా మ్యాచ్ రద్దు కావడం ఎప్పుడైనా చూశారా? లేదా విన్నారా? బహుశా క్రికెట్ చరిత్రలోనే ఇలా ఓ మ్యాచ్ బాల్ కారణంగా రద్దు కావడం ఇదే తొలిసారేమో. ఈ ఘటన మహిళల బిగ్‌బాష్ లీగ్ 2025లో జరిగింది.
అసలేం జరిగిందంటే..?
మహిళల బిగ్‌బాష్ లీగ్ 2025లో (WBBL 2025) భాగంగా అడిలైడ్ వేదికగా శుక్రవారం (డిసెంబర్ 5న) అడిలైడ్ స్ట్రైకర్స్, హోబర్ట్ హరికేన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ ఓడిపోవడంతో అడిలైడ్ స్ట్రైకర్స్ బ్యాటింగ్‌కు దిగింది. మడేలిన్ పెన్నా (63; 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. టామీ బ్యూమాంట్ (29), బ్రిడ్జేట్ ప్యాటర్సన్ (24) లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు 167 పరుగులు సాధించింది.
ఇక ఇన్నింగ్స్ విరామ సమయంలో ఓ భారీ రోలర్‌తో పిచ్‌పై రోలింగ్ చేస్తున్నారు. ఆ పక్కనే కొందరు ప్లేయర్లు ఫీల్డింగ్ వార్మప్ లు చేస్తున్నారు. పిచ్ పై రోలర్ రోలింగ్ చేస్తుండగా ఫీల్డింగ్ వార్మప్ నుంచి ఓ బంతి వచ్చింది. ఆ బాల్ కాస్త రోలర్ కింద పడింది. రోలర్ బరువు కారణంగా బంతి పిచ్ మధ్యలో దిగబడింది. ఆ తరువాత బంతిని పిచ్ నుంచి తొలగించినప్పటికి కూడా అక్కడ ఓ రంధ్రం ఏర్పడింది.
As a result, pitch conditions were changed significantly.
After consultation, it was considered unreasonable to expect Hobart to bat in conditions that were materially different to those the Strikers had.
Both captains were consulted and accepted the decision. (2/2) #WBBL11 pic.twitter.com/Bs7rFDV2fe
— Weber Women’s Big Bash League (@WBBL) December 5, 2025
దీనిపై మ్యాచ్ రిఫరీ, అంపైర్లు సంప్రదింపులు జరిపారు. దాన్ని పూడ్చివేసినప్పటికి కూడా హరికేన్స్ బ్యాటింగ్ సమయంలో భిన్నపరిస్థితులు ఉంటుందని (ఇరు జట్లకు ఒకే రకమైన పిచ్ ఉందని) భావించారు. ఇరు జట్ల కెప్టెన్లు, అధికారులతో సంప్రదింపుల అనంతరం మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని అడిలైడ్ స్ట్రైకర్స్, బిగ్ బాష్ లీగ్ నిర్వాహకులు తమ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Smriti Mandhana : ఎంగేజ్‌మెంట్ రింగ్ ఎక్కడ? పెళ్లి వాయిదా తరువాత స్మృతి మంధాన ఫస్ట్ పోస్ట్..
ఇలాంటి ఘటనలు తామెప్పుడు చూడలదేని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.