Smriti Mandhana : ఎంగేజ్‌మెంట్ రింగ్ ఎక్క‌డ‌? పెళ్లి వాయిదా త‌రువాత స్మృతి మంధాన ఫ‌స్ట్ పోస్ట్‌..

వివాహం వాయిదా ప‌డిన త‌రువాత స్మృతి మంధాన (Smriti Mandhana ) తొలిసారి సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.

Smriti Mandhana : ఎంగేజ్‌మెంట్ రింగ్ ఎక్క‌డ‌?  పెళ్లి వాయిదా త‌రువాత స్మృతి మంధాన ఫ‌స్ట్ పోస్ట్‌..

Smriti Mandhana posts for the first time on Instagram after wedding postpone

Updated On : December 6, 2025 / 11:08 AM IST

Smriti Mandhana : భార‌త మ‌హిళా స్టార్ బ్యాట‌ర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప‌లాశ్ ముచ్చ‌ల్ ల పెళ్లి న‌వంబ‌ర్ 23న జ‌ర‌గాల్సి ఉండ‌గా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. వివాహం వాయిదా ప‌డిన త‌రువాత స్మృతి మంధాన తొలిసారి సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అయితే.. ఇది ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన వీడియో. ఇక్క‌డ వ‌ర‌కు అంతా బాగానే ఉంది గానీ.. ఈ వీడియోలో స్మృతి మంధాన (Smriti Mandhana ) చేతి వేలికి ఎంగేజ్‌మెంట్ రింగ్ క‌నిపించ‌డం లేదు.

దీంతో ఫ్యాన్స్ అయోమ‌యంలో ప‌డిపోయారు. ఎందుకంటే పెళ్లి వాయిదా ప‌డిన త‌రువాత వివాహ వేడుక‌కు సంబంధించిన అన్ని ఫోటోలు, వీడియోల‌ను స్మృతి మంధాన త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల నుంచి తొల‌గించ‌డంతో ఊహాగానాలు మొద‌లు అయ్యాయి. ఇప్పుడు తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకపోవ‌డంతో ఆ ఊహాగానాల‌కు మ‌రింత ఆజ్యం పోసిన‌ట్లు అయింది.
IND vs SA : 20తో ఆగుతుందా.. 21కి చేరుతుందా..

అయితే.. మంధాన తాజాగా పోస్ట్ చేసిన వీడియో ఎంగేజ్‌మెంట్ ముందు చిత్రీక‌రించారా? లేక త‌రువాత అన్న‌దానిపై స్ప‌ష్ట‌త లేదు.

మంధాన తండ్రి అనారోగ్యంతో..

స‌రిగ్గా పెళ్లికి కొన్ని గంట‌ల ముందు స్మృతి మంధాన తండ్రి అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరారు. ఆ త‌రువాత ఆమెకు కాబోయే భ‌ర్త ప‌లాష్ సైతం ఆస్ప‌త్రిలో చేరాడు. ఈ నేప‌థ్యంలో పెళ్లిని వాయిదా వేస్తున్న‌ట్లు మంధాన ప్ర‌తినిధి తెలిపారు. అదే స‌మ‌యంలో మంధాన వీడియోలు తొల‌గించ‌డం, ప‌లాష్ మ‌రో యువ‌తితో చాటింగ్ చేశాడ‌నే వార్త‌లు రావ‌డంతో పెళ్లిపై ఊహాగానాలు మొద‌లు అయ్యాయి. ఈ ప‌రిణామ‌ల మ‌ధ్య ఇటీవ‌ల ప‌లాష్ త‌ల్లి మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం అంతా బాగానే ఉంద‌ని, త్వ‌ర‌లోనే వివాహం జ‌రుగుతుంద‌ని చెప్పింది.

Rohit Sharma : విశాఖ‌లో ద‌క్షిణాఫ్రికాతో మూడో వ‌న్డే.. రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..

 

View this post on Instagram

 

A post shared by Smriti Mandhana (@smriti_mandhana)