Google search In 2025 : 2025లో గూగుల్‌లో ఏ ఐపీఎల్ జ‌ట్టు కోసం ఎక్కువ‌గా వెతికారో తెలుసా..? ఆర్‌సీబీ, చెన్నై, ముంబైలు కానే కాదు..

2025 సంవ‌త్స‌రంలో క్రీడ‌ల్లో ఎన్నో ఉత్తేజ‌క‌ర‌మైన క్ష‌ణాలు, ఊహించ‌ని ప‌రాజయాల‌ను చూశాము.

Google search In 2025 : 2025లో గూగుల్‌లో ఏ ఐపీఎల్ జ‌ట్టు కోసం ఎక్కువ‌గా వెతికారో తెలుసా..? ఆర్‌సీబీ, చెన్నై, ముంబైలు కానే కాదు..

Do you know Most Searched IPL Team On Google In 2025

Updated On : December 6, 2025 / 11:57 AM IST

Google search In 2025 : మ‌రికొన్ని రోజుల్లో కొత్త సంవ‌త్స‌రం రానుంది. 2025 సంవ‌త్స‌రంలో క్రీడ‌ల్లో ఎన్నో ఉత్తేజ‌క‌ర‌మైన క్ష‌ణాలు, ఊహించ‌ని ప‌రాజయాల‌ను చూశాము. ముఖ్యంగా ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అభిమానుల‌కు ఈ ఏడాది ఎంతో ప్ర‌త్యేకం అన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ తొలిసారి ఆర్‌సీబీ జ‌ట్టు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఐపీఎల్ విజేత‌గా నిలిచిన క్షణంలో స్టార్ విరాట్ కోహ్లీ సైతం భావోద్వేగానికి గురైయ్యాడు.

అయితే.. ఆస‌క్తిక‌రంగా ఈ ఏడాది (2025లో) గూగుల్‌లో అత్య‌ధికంగా సెర్చ్ చేసిన ఐపీఎల్‌ జ‌ట్టు ఆర్‌సీబీ కాదు. ఐదుసార్లు ఛాంపియ‌న్లుగా నిలిచిన చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్ కూడా కానే కాదు.

Smriti Mandhana : ఎంగేజ్‌మెంట్ రింగ్ ఎక్క‌డ‌? పెళ్లి వాయిదా త‌రువాత స్మృతి మంధాన ఫ‌స్ట్ పోస్ట్‌..

గూగుల్ స‌మాచారం ప్ర‌కారం.. 2025లో అత్య‌దికంగా నెటిజ‌న్లు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జ‌ట్టు కోసం సెర్చ్ చేశారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలోని పంజాబ్ కింగ్స్ జ‌ట్టు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

వాస్తవానికి.. పారిస్ సెయింట్-జర్మైన్, బెన్ఫికా, టొరంటో బ్లూ జేస్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించబడిన క్రీడా జట్లలో పంజాబ్ కింగ్స్‌ స్థానం సంపాదించింది. ఇక ఐపీఎల్‌లో పంజాబ్ త‌రువాత వ‌రుస‌గా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ కోసం సెర్చ్ చేశారు.

IND vs SA : 20తో ఆగుతుందా.. 21కి చేరుతుందా..

ఇక దీనిపై పంజాబ్ కింగ్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సౌరభ్ అరోరా మాట్లాడుతూ.. ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. ప్రజలు మమ్మల్ని చూడటం మాత్రమే కాదు.. ఇది వారు జట్టు పై ఆసక్తిగా, భావోద్వేగపరంగా ఎలా ముడిపడి ఉన్నారనే విష‌యాన్ని తెలియ‌జేస్తుంద‌న్నారు. దీన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకుంటామ‌ని, ప్ర‌జ‌ల‌కు ఇంకా ద‌గ్గ‌ర అయ్యేందుకు శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నిస్తామ‌ని చెప్పారు.