uppal stadium
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆధ్వర్యంలో ఉప్పల్ మైదానంలో ఐపీఎల్(IPL) మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఈ మైదానంలో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. గెలుపోటముల సంగతులను కాస్త పక్కన పెట్టినట్లయితే ఈ మ్యాచ్‌లు అభిమానులకు కావాల్సినంత మజాను అందించాయి. అయితే.. మైదానంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఇబ్బందులు పడుతూనే మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు హెచ్‌సీఏ బాధ్యతలు నిర్వహిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు.
ఎన్ని సమస్యలు ఉన్నప్పటికి మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులకు త్రాగు నీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మ్యాచ్‌లు జరగని సమయంలో గ్రౌండ్‌ను సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల పలు ఇబ్బందులు వస్తున్నాయి. అందులో డ్రైనేజ్ సిస్టం ప్రాబ్లం ఒకటి అని, కార్పొరేట్ బాక్స్‌లలో ఏసీలు, టీవీలలో చాలా పాడైపోయానన్నారు. మిగిలిన మ్యాచ్‌లను సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
IPL 2023, DC Vs SRH: ఢిల్లీ పై సన్‌రైజర్స్ గెలుపు.. రాణించిన క్లాసెన్, అభిషేక్
ఫేక్ టికెట్ల విక్రయం మా దృష్టికి వచ్చింది. లోకల్ పోలీసులు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఫేక్ టికెట్లు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ఈ సారి ఫిజికల్‌గా మ్యాచ్ టికెట్లు అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. క్లబ్‌మెంబెర్స్‌తో పాటు హెచ్‌సీఏ దగ్గర రిజిస్టర్ అయినా క్రీడాకారులకు కూడా పాస్ లు ఇస్తున్నట్లు తెలిపారు.
వన్డే వరల్డ్ కప్ కోసం స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నాము. అయితే.. కొన్ని సదుపాయాలు కావాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)ని కోరినట్లు తెలిపారు. ప్రపంచకప్ వరకు స్టేడియాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా 50 మంది మహిళలు, 50 మంది పురుష క్రీడాకారులకు ట్రైనింగ్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
హెచ్‌సీఏ ఎన్నికల ప్రాసెస్ మొదలైంది
HCA ఎన్నికల ప్రాసెస్ మొదలైనట్లు దుర్గా ప్రసాద్ తెలిపారు. అన్ని క్లబ్ మెంబర్స్ కు నోటీసులు పంపగా.. చాలా మంది ఎన్నికలకు సంబందించిన వివరాలు ఇచ్చారన్నారు. 2018 నుండి అడిట్ జరగడం లేదని బీసీసీఐ నుండి ఆరోపణలు వచ్చాయని, అడిట్ ప్రక్రియ జరుగుతుందని ఈ సంవత్సరం వరకు అడిట్ ప్రక్రియ పూర్తి అయ్యేలా చూస్తున్నట్లు దుర్గాప్రసాద్ చెప్పారు.