Virender Sehwag : క‌ష్టం మాది.. పేరు గ్యారీ కిర్‌స్ట‌న్ ది.. ఆ త‌రువాత అత‌డు సాధించింది సున్నా

టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాము బాగా ఆడ‌డం వ‌ల్లే కోచ్ గా గ్యారీ కిర్‌స్టన్ (Gary Kirsten) కు మంచి పేరు వ‌చ్చింద‌న్నాడు.

Virender Sehwag comments on Gary Kirsten

Virender Sehwag – Gary Kirsten : టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాము బాగా ఆడ‌డం వ‌ల్లే కోచ్ గా గ్యారీ కిర్‌స్టన్ (Gary Kirsten) కు మంచి పేరు వ‌చ్చింద‌న్నాడు. ఆ త‌రువాత అత‌డు ఎన్నో జ‌ట్ల‌కు కోచింగ్ ఇచ్చినా సాధించింది శూన్య‌మ‌న్నాడు. ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌నపైనే కోచ్‌ల కీర్తి ప్ర‌తిష్ట‌లు ఆధార‌ప‌డి ఉంటాయ‌ని చెప్పుకొచ్చాడు. మొత్తంగా త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు, టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ప‌రోక్షంగా స్పందించాడు.

వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2023 షెడ్యూల్ విడుద‌ల సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో వీరూ మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. మైదానంలో ఆట‌గాళ్లు అడుగుపెట్టిన త‌రువాత కోచ్ భ‌విష్య‌త్తు ప్లేయ‌ర్ల ఆట‌తీరుపై ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నాడు. ఆట‌గాళ్లు బాగా ఆడితే కోచ్‌ల‌కు మంచి పేరు వ‌స్తుంది. లేదంటే విమ‌ర్శ‌లు త‌ప్ప‌వ‌న్నాడు. టీమ్ఇండియా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు చేరింది. దీన్ని గురించి ఎవ్వ‌రూ మాట్లాడ‌రు.అయితే.. ఫైన‌ల్‌లో ఓడిపోవ‌డం గురించే అంద‌రూ మాట్లాడుతార‌న్నారు.

Ashes : స్టీవ్ స్మిత్ రికార్డు సెంచ‌రీ.. రెండో టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆలౌట్‌

రాహుల్ ద్రావిడ్ మంచి కోచ్ అన‌డంలో ఎటువంటి సందేహం అక్క‌ర‌లేద‌ని వీరూ చెప్పాడు. అయిన‌ప్ప‌టికీ గ్రౌండ్‌లో ఆడాల్సింది ఆట‌గాళ్లేన‌ని అన్నాడు. 2011 మేము అద్భుతంగా ఆడి ప్ర‌పంచ క‌ప్ ను సాధించాం. దీంతో గ్యారీ కిర్‌స్ట‌న్‌కు మంచి పేరు వ‌చ్చింది. అయితే.. ఆ త‌రువాత అతడు ఎన్నో జ‌ట్ల‌కు కోచ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. అయిన‌ప్ప‌టికీ ఒక్క‌సారి కూడా ఆయా జ‌ట్ల‌ను విజేత‌గా నిల‌ప‌లేక‌పోయాడ‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలన్నాడు.

Virender Sehwag : సెమీస్‌లో ఆ రెండు జ‌ట్లు ఖ‌చ్చితంగా ఉంటాయి.. అయితే అవి భార‌త్‌, పాకిస్తాన్ కాదు

ఐపీఎల్లో గుజ‌రాత్ టైటాన్స్ విజేత‌గా నిలిచిన‌ప్ప‌టికీ అందులో గ్యారీ కిర్‌స్టన్ కంటే ఆశిష్ నెహ్రా పాత్రే ఎక్కువ‌న్నాడు. మ్యాచ్‌ల సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని మ‌నం చాలా సార్లు టీవీల్లో చూశాం అని సెహ్వాగ్ అన్నాడు. ఆట‌గాళ్లు త‌మ అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇస్తే ఈ సారి టీమ్ఇండియా ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని సెహ్వాగ్ అభిప్రాయ‌ప‌డ్డాడు.