Virender Sehwag : సెమీస్‌లో ఆ రెండు జట్లు ఖచ్చితంగా ఉంటాయి.. అయితే అవి భారత్, పాకిస్తాన్ కాదు
ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరే నాలుగు జట్లు ఏవో భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశాడు. మెగా టోర్నీలో అద్భుతాలు జరిగే అవకాశం ఉందని వీరూ తెలిపాడు.

Virender Sehwag
Virender Sehwag Semis teams : భారత్ వేదికగా ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ 2023 జరగనుంది. ఇప్పటికే ఐసీసీ ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా 2019 ప్రపంచ కప్ విజేత, రన్నరప్ లు అయిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి మ్యాచ్‌తో మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఇక భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. మెగా టోర్నీకి మరో మూడు నెలల సమయం ఉండడంతో జట్ల సన్నాహాకాలు, సెమీఫైనల్, ఫైనల్‌కు చేరే జట్లపై చర్చలు మొదలు అయ్యాయి.
ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరే నాలుగు జట్లు ఏవో భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అంచనా వేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్‌లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయని అన్నాడు. ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు అయితే తప్పకుండా సెమీస్‌కు వస్తాయన్నాడు. ఇరు జట్లు ఆడే విధానమే అందుకు కారణమని చెప్పుకొచ్చాడు. మిగతా రెండు జట్లు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, అయితే..మెగా టోర్నీలో అద్భుతాలు జరిగే అవకాశం లేకపోలేదని వీరూ తెలిపాడు.
Virender Sehwag : అప్పుడు సచిన్ కోసం గెలిచాం.. ఇప్పుడు కోహ్లి కోసం గెలవండి
ఇక ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య మ్యాచ్‌ను చూసేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు శ్రీలంక మాజీ దిగ్గజ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. “నేను ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాను. భారత్ ఫేవరెట్‌లలో ఒకటి ఎందుకంటే వారు స్వదేశంలో ఆడుతున్నారు.ఎలా గెలవాలో వారికి తెలుసు. ఇది చాలా ఆసక్తికరమైన మ్యాచ్ అవుతుంది .” అని మురళీధరన్ అన్నారు. .
ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటి వరకు భారత్, పాక్‌లు వన్డే ప్రపంచకప్‌లలో ఏడు సార్లు తలపడ్డాయి. అన్ని మ్యాచుల్లోనూ భారత్ జట్టే విజేతగా నిలిచింది.
Virat Kohli : లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న కోహ్లి.. ఫోటోలు వైరల్
అక్టోబరు 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది. 10 వేదికలలో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. మొత్తం 10 జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి 8 జట్లు అర్హత సాధించగా మరో రెండు స్థానాల కోసం ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నీ జరగుతోంది. ఇందులో ఫైనల్ చేరిన రెండు జట్లు ప్రపంచకప్ ఆడేందుకు అర్హత సాధిస్తాయి.