Virat Kohli : లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న కోహ్లి.. ఫోటోలు వైరల్
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) మాత్రం లండన్‌లోనే ఉండిపోయాడు. లండన్ వీధుల్లో అతడు ఒంటరిగా నడుస్తూ చక్కర్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Virat Kohli on London streets
Virat Kohli on London streets : లండన్‌లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్(WTC Final)లో టీమ్ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనకు ముందు టీమ్ఇండియా ఆటగాళ్లకు నెలరోజులకు పైగా విశ్రాంతి లభించింది. దీంతో చాలా మంది క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో టూర్లకు వెళ్లారు. ఇక భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) మాత్రం లండన్‌లోనే ఉండిపోయాడు. లండన్ వీధుల్లో అతడు ఒంటరిగా నడుస్తూ చక్కర్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెల్ల టీషర్ట్, నల్ల స్వెటర్, బ్రౌన్ ప్యాంట్, తెల్ల స్నీకర్స్ వేసుకున్న కోహ్లి చాలా స్ట్రైలిష్‌గా కనిపిస్తున్నాడు. లండన్ వీధుల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. కాగా.. గతంలో ఓ ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడుతూ తనకు రోడ్డుపై నడుస్తూ వెళ్లడంతో పాటు షాపులకు వెళ్లి ఇష్టమైనవి కొనుగోలు చేయడం అంటే ఎంతో ఇష్టం అని చెప్పాడు. తాను టీమ్ఇండియాకు ఎంపికైన తరువాత నుంచి భారతదేశంలోని రోడ్లపై తాను నడవలేకపోయానని తెలిపాడు. కోహ్లి లాంటి స్టార్ సెలబ్రెటీస్ రోడ్లపై కనిపిస్తే అభిమానులు ఊరుకుంటారా చెప్పండి..? సెల్ఫీలు అంటూ వారిని ఇబ్బందులు పెడుతుంటారు. అందుకే లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు.
Jasprit Bumrah : బుమ్రా ప్రాక్టీస్.. రోజుకు ఏడు ఓవర్ల బౌలింగ్.. రీ ఎంట్రీకి సిద్ధమా..!
ఇటీవల ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వాంఖడే లో ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు కోహ్లి తెలిపాడు. 2011 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కోహ్లి సభ్యుడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసెఇందే. ప్రపంచ కప్ గెలిచిన మధుర క్షణాలు ఇంకా తన కళ్ల ముందే మెదులుతున్నాయని కోహ్లి చెప్పాడు.

Virat Kohli on London streets
వెస్టిండీస్ పర్యటనలో అదరగొట్టేందుకు కోహ్లి సిద్దం అవుతున్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లి 178 పరుగులు చేస్తే విండీస్‌పై టెస్టుల్లో 1000 పూర్తి చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు. విరాట్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా (2,042), ఇంగ్లండ్ (1,991), దక్షిణాఫ్రికా (1,236), శ్రీలంక (1,085)పై 1000 పరుగులు చేశాడు.