Ashes : ప్రారంభ‌మైన యాషెస్ రెండో టెస్టు.. ఊహించ‌ని ప‌రిణామం.. ఆందోళ‌న కారుడిని ఎత్తి ప‌డేసిన బెయిర్ స్టో

ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లాండ్‌(England), ఆస్ట్రేలియా(Australia) జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ బుధ‌వారం ప్రారంభ‌మైంది. మ్యాచ్ మొద‌లైన కాసేప‌టికే ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది.

Ashes : ప్రారంభ‌మైన యాషెస్ రెండో టెస్టు.. ఊహించ‌ని ప‌రిణామం.. ఆందోళ‌న కారుడిని ఎత్తి ప‌డేసిన బెయిర్ స్టో

Jonny Bairstow carries protestor

Updated On : July 1, 2023 / 11:45 AM IST

Ashes ENG vs AUS : ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లాండ్‌(England), ఆస్ట్రేలియా(Australia) జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ బుధ‌వారం ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు తేడాతో ఆసీస్ సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే.. మ్యాచ్ మొద‌లైన కాసేప‌టికే ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది.

రెండో ఓవ‌ర్ ప్రారంభ స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కొంద‌రు ఆందోళ‌న కారులు మైదానంలోని పిచ్‌పైకి దూసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఒక్క‌సారిగా అక్క‌డ ఏం జ‌రుగుతుంద‌నేది అర్ధం కాని ప‌రిస్థితి నెల‌కొంది. సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌లం అయ్యారు. దీంతో వారు మైదానంలోకి ప‌రుగెత్తారు.

benstokes try stop protestor

benstokes try stop protestor

Virender Sehwag : స‌చిన్ చాలా బ‌రువు.. భుజాల‌పై మోయ‌డ‌మా.. మా వ‌ల్ల కాద‌న్నాం.. అయితే కోహ్లి మాత్రం..

ఈ క్ర‌మంలో జస్ట్ స్టాప్ ఆయిల్ టీష‌ర్డ్ ధ‌రించి నారింజ రంగు బ్యాగ్‌ల‌ను ప‌ట్టుకున్న ఇద్ద‌రు ఆందోళ‌న కారుల‌ను బౌలింగ్ ఎండ్‌లో సిబ్బంది అడ్డుకుంటూ కింద‌పడేశారు. ఓ ఆందోళ‌న కారుడిని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌, ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ అడ్డుకునేందుకు య‌త్నించారు. కాగా.. ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు జానీ బెయిర్ స్టో మాత్రం త‌న వైపుగా దూసుకువ‌చ్చిన ఓ ఆందోళ‌న కారుడిని అమాంతం ఎత్తుకుని న‌డుచుకుంటూ వెళ్లి బౌండ‌రీ లైన్ అవ‌త‌ల ప‌డేశాడు.

protesters stop by security

protesters stop by security

IRE vs IND : వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న అనంత‌రం.. ఐర్లాండ్‌కు టీమ్ఇండియా.. షెడ్యూల్ ఇదే

ఈ క్ర‌మంలో ఆందోళ‌న కారుడు అత‌డి చేతిలో ఉన్న బ్యాగ్‌లోంచి నారింజ రంగులో ఉన్న పొడిని చ‌ల్ల‌డంతో బెయిర్ స్టో టీ ష‌ర్డ్ పాడైంది. బెయిర్ స్టో వెంట‌నే డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి ష‌ర్ట్ మార్చుకుని వ‌చ్చాడు. బెయిర్ స్టో తిరిగి మైదానంలో అడుగుపెడుతున్న స‌మ‌యంలో అత‌డు చేసిన ప‌నిని మెచ్చుకుంటూ చ‌ప్ప‌ట్ల‌తో స్వాగ‌తం ప‌లికారు. ఇంగ్లాండ్‌, ఆసీస్ ఆట‌గాళ్లు సైతం అత‌డికి అభినంద‌న‌లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

protestor stop by security

protestor stop by security

కాగా.. ఈ ఘ‌ట‌న కార‌ణంగా మ్యాచ్‌కు అంత‌రాయం క‌లిగింది. గ్రౌండ్‌స్టాఫ్ ఔట్‌ఫీల్డ్ నుండి నారింజ పొడిని తొలగించడానికి లీఫ్ బ్లోయర్‌లను ఉపయోగించారు. దీంతో మ్యాచ్‌కు దాదాపు ఐదు నిమిషాల పాటు అంత‌రాయం క‌లిగింది. నిబంధ‌న‌లు అత్రిక్ర‌మించిన ముగ్గురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.

TNPL : మైండ్ ఎక్క‌డ పెట్టార‌య్యా..! ర‌నౌట్ అయినా ప‌ట్టించుకోలే.. బ్యాట‌ర్ బ‌చ్‌గ‌యా

ఇంగ్లాండ్‌లోని ఆయిల్ ట‌ర్మినెల్స్‌ను కాపాడాలంటూ 2022 నుంచి జ‌స్ట్ స్టాప్ అయిల్ అనే ఉద్య‌మం ఇంగ్లాండ్‌లో కొన‌సాగుతోంది. ఇటీవ‌ల ఆందోళ‌న కారులు ఎక్క‌డ మ్యాచులు జ‌రిగినా వెళ్లి అడ్డుప‌డే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.