TNPL : మైండ్ ఎక్కడ పెట్టారయ్యా..! రనౌట్ అయినా పట్టించుకోలే.. బ్యాటర్ బచ్‌గయా
సాధారణంగా క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ఎప్పుడెప్పుడు ఔట్ అవుతాడా అని ఫీల్డర్లు ఎదురుచూస్తుంటారు. అయితే.. ఇక్కడ ఫీల్డింగ్ జట్టు అలసత్వం కారణంగా ఓ బ్యాటర్ రనౌట్ అయినా కూడా ఎంచక్కా బ్యాటింగ్ కొనసాగించాడు.

TNPL
Tamil Nadu Premier League : సాధారణంగా క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ఎప్పుడెప్పుడు ఔట్ అవుతాడా అని ఫీల్డర్లు ఎదురుచూస్తుంటారు. అయితే.. ఇక్కడ ఫీల్డింగ్ జట్టు అలసత్వం కారణంగా ఓ బ్యాటర్ రనౌట్ అయినా కూడా ఎంచక్కా బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ ఘటన తమిళనాడు ప్రీమియర్ లీగ్(TNPL)లో చోటు చేసుకుంది. లికా కోవై కింగ్స్, సేలం స్పార్టాన్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.
లైకా కోవై కింగ్స్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో స్పార్టాన్స్ బౌలర్ అభిషేక్ తన్వార్ వేసిన నాలుగో బంతికి కింగ్స్ బ్యాటర్ సుజయ్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఫీల్డర్ బంతిని అందుకుని వికెట్ల వైపుకు నేరుగా త్రో చేశాడు. అదే సమయంలో సుజయ్ క్రీజులో వస్తున్నాడు. బంతి ఎక్కడ తనను తాకుతుందేమోనని అతడు గాల్లోకి ఎగిరాడు. బంతి నేరుగా వికెట్లను తాకింది. అయితే.. సుజయ్ అప్పటికి క్రీజులో బ్యాట్‌ను గానీ, కాలును గానీ పెట్టలేదు.
IRE vs IND : వెస్టిండీస్ పర్యటన అనంతరం.. ఐర్లాండ్‌కు టీమ్ఇండియా.. షెడ్యూల్ ఇదే
వికెట్లను తాకిన బంతి దూరంగా వెళ్లగా మరొక పరుగు తీశారు. కాగా.. సుజయ్ క్రీజులోకి వచ్చాకే జంప్ చేశాడని ఫీల్డర్లతో పాటు అంపైర్లు బావించినట్లుగా ఉన్నారు. ఫీల్డర్లు అప్పీల్ చేయకపోవడంతో అంఫైర్లు కూడా థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయలేదు. మ్యాచ్ కొనసాగింది. అయితే.. ఆ తరువాత రిప్లై చూసినప్పుడు మొదటి పరుగు చేసేటప్పుడే సుజయ్ రనౌట్ అయ్యినట్లు స్పష్టంగా కనిపించింది. దీన్ని చూసిన ఫీల్డర్లు నెత్తిపై చేతులు పెట్టుకున్నారు.
Virender Sehwag : అప్పుడు సచిన్ కోసం గెలిచాం.. ఇప్పుడు కోహ్లి కోసం గెలవండి
ఆ సమయంలో సుజయ్ 10 పరుగులే చేశాడు. రనౌట్ ప్రమాదం నుంచి బయటపడ్డ అతడు 32 బంతుల్లో 6 ఫోర్లు బాది 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం రనౌట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో స్పార్టాన్స్ 120 పరుగులకే కుప్పకూలింది.
“It was out, why was not it referred?” ?
..#TNPLonFanCode pic.twitter.com/OnA20upedh
— FanCode (@FanCode) June 27, 2023