Sourav Ganguly security upgrade
Sourav Ganguly security upgrade: టీమ్ఇండియా(Team India) మాజీ కెప్టెన్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) విషయంలో పశ్చిమ బెంగాల్(West Bengal) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గంగూలీకి భద్రత పెంచాలని నిర్ణయించింది. అతడికి ఇస్తున్న భద్రతను ‘Z’ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకు దాదాకి ‘Y’ కేటగిరి భద్రతను కల్పిస్తున్నారు. మే 16తో ఇది ముగిసింది.
దీంతో ప్రోటోకాల్ ప్రకారం సమీక్షను నిర్వహించారు. రాష్ట్ర సెక్రటేరియట్ ప్రతినిధులు మంగళవారం గంగూలీ నివాసమైన బెహలాకు వెళ్లారు. అక్కడ వారు కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లాల్‌బజార్, స్థానిక పోలీస్ స్టేషన్‌లోని అధికారులతో సమావేశమయ్యారు. భద్రతా ప్రోటోకాల్ గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఇందులో భద్రతను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
IPL 2023: భావోద్వేగానికి గురైన లక్నో స్టార్ బౌలర్.. 10 రోజులుగా ఐయూసీలో తండ్రి.. ఆయనకే అంకితం
Y కేటగిరీ Z కేటగిరీ మధ్య ఉన్న తేడా ఏమిటంటే..?
‘వై’ కేటగిరీలో గంగూలీ నివాసం వద్ద ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ముగ్గురు లా ఎన్‌ఫోర్సర్ పోలీసులు ఉండేవారు. ‘Z’ కేటగిరీలో ఎనిమిది నుంచి 10 మంది భద్రతా అధికారులు (24 గంటల పాటు) గంగూలీకి సెక్యూరిటీ ఇస్తారు. ప్రస్తుతం గంగూలీ కోల్‌కతాలో లేడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సాయం చేస్తున్నాడు. అతడు మే 21న కోల్‌కతాకు తిరిగి వస్తాడు. ఈ రోజు నుంచి Z కేటగిరీ సెక్యూరిటీ పొందనున్నాడు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో గంగూలీ సేవలు అందిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేలవంగా ఆడుతోంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవలం 4 మ్యాచుల్లో గెలిచింది. 8 పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతూ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది. మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా ఈ మ్యాచుల్లో గెలిచిన పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే.. ఢిల్లీ గెలుపోటములు మిగతా జట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
IPL 2023, CSK vs DC: చెపాక్‌లో చెలరేగిన ధోని సేన.. ఢిల్లీపై ఘన విజయం