IPL 2023: భావోద్వేగానికి గురైన ల‌క్నో స్టార్ బౌల‌ర్‌.. 10 రోజులుగా ఐయూసీలో తండ్రి.. ఆయ‌నకే అంకితం

ఐపీఎల్2023లో భాగంగా ల‌క్నోలో మంగ‌ళ‌వారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మొహ్సిన్ ఖాన్ ఆఖ‌రి ఓవ‌ర్‌ను అద్భుతంగా వేసి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అభిమానులకు హీరోగా మారాడు.

IPL 2023: భావోద్వేగానికి గురైన ల‌క్నో స్టార్ బౌల‌ర్‌.. 10 రోజులుగా ఐయూసీలో తండ్రి.. ఆయ‌నకే అంకితం

Mohsin Khan (Photo @IPL)

Mohsin Khan: మొహ్సిన్ ఖాన్(Mohsin Khan).. ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ల‌క్నోలో మంగ‌ళ‌వారం ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆఖ‌రి ఓవ‌ర్‌ను అద్భుతంగా వేసి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(Lucknow Super Giants) అభిమానులకు హీరోగా మారాడు. ముంబై విజ‌యానికి చివ‌రి ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు అవస‌రమైన ద‌శలో క్రీజులో కామెరూన్ గ్రీన్‌, టిమ్ డేవిడ్ వంటి హిట్ట‌ర్లు ఉండ‌గా.. ఆరు బంతుల్లో ఐదు ప‌రుగులే ఇచ్చాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో మూడు ఓవ‌ర్లు బౌలింగ్ చేసి 26 ప‌రుగులు ఇచ్చి ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

మ్యాచ్ అనంత‌రం త‌న ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల మొహ్సిన్ ఖాన్ సంతృప్తిని వ్యక్తం చేశాడు. త‌న ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను త‌న తండ్రిని అంకితం చేశాడు. గ‌త ప‌ది రోజులుగా మొహ్సిన్ ఖాన్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఐసీయూలో చికిత్స పొందాడు. మ్యాచ్ జ‌రిగిన మంగ‌ళ‌వారం రోజే అత‌డు డిశ్చార్జి అయ్యాడు. ఈ విష‌యాన్ని చెబుతూ మొహ్సిన్ ఖాన్ భావోద్వేగానికి గురైయ్యాడు.

IPL 2023 : ముంబైకి బిగ్ షాక్.. ఉత్కంఠ పోరులో లక్నో విజయం

గ‌త ఏడాది కాలంగా మొహ్సిన్ ఖాన్ ఎన్నో ఇబ్బందులు ప‌డిన‌ట్లు చెప్పాడు. గాయం కార‌ణంగా సంవ‌త్స‌రం పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వ‌చ్చిందన్నాడు. ఈ సీజ‌న్ ఐపీఎల్‌తో మ‌ళ్లీ మైదానంలోకి అడుగు పెట్ట‌డం చాలా సంతోషంగా ఉంద‌ని, గ‌త మ్యాచ్‌లో మంచి ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌లేక‌పోయిన‌ప్ప‌టికి త‌న పై ఉన్న న‌మ్మ‌కంతో గౌత‌మ్ గంభీర్‌, విజ‌య్ ద‌హియాలు మ‌రో అవ‌కాశం ఇచ్చార‌ని, ఇందుకు వారికి ధ‌న్యావాదాలు చెప్పాడు.

చివ‌రి ఓవ‌ర్ కోసం తాను ప్ర‌త్యేకంగా ఏమీ చేయ‌లేద‌ని, స్కోరు బోర్డు వైపు మాత్రం చూడ‌కుండా ఆరు బంతులను వేసిన‌ట్లు తెలిపాడు. ‘నాన్న గ‌త ప‌ది రోజులుగా ఐసీయూలో ఉన్నాడు. మంగ‌ళ‌వారమే డిశ్చార్జి అయ్యారు. త‌ప్ప‌కుండా మా నాన్న మ్యాచ్ చూసిఉంటార‌న్న న‌మ్మ‌కం ఉంది. నా ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను మా నాన్న‌కు అంకితం ఇస్తున్నా.’ అని మొహ్సిన్‌ ఖాన్ అన్నాడు.

IPL 2023: మహ్మద్ సిరాజ్ ఇంట్లో విరాట్ కోహ్లీ, ఆర్సీబీ టీం ప్లేయర్లు సందడి.. ఫొటోలు, వీడియో వైరల్

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య‌ఛేద‌న‌లో ముంబై 172 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో ముంబై ఐదు ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.